మృతుని కుటుంబాన్ని పరామర్శించిన చేనేత శాఖ ఏ డి. శ్రీనివాస్ రెడ్డి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలో గల రాంనగర్ నందు నివసించుచున్న ఉడుముల రంగ, అను చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి విచారణ చేయుటకు మృతుని కుటుంబమును పరామర్శించుటకు చేనేత శాఖ ఏడి. శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుని గృహమును సందర్శించి పరామర్శించడం జరిగింది అని, సదరు చేనేత కార్మికుని ఆత్మహత్యకు గల కారణం గురించి, వారి కుటుంబంలో వారికి అవసరమైన ప్రభుత్వ సహాయం గురించి విచారణ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సదరు కుటుంబ సభ్యులు తెలిపిన వివరముల మేరకు మృతిచెందిన చేనేత కార్మికుడు రెండు సంవత్సరముల కిందట కొత్త ఇల్లు నిర్మాణమునకు అదే విధంగా చేనేత వృత్తిపరమైన ఇతరమైన అవసరముల కొరకు అప్పులు చేయడం జరిగిందన్నారు. దాదాపు గా ఆరు లక్షలు రూపాయలు వివిధ వ్యక్తుల దగ్గర అప్పులు చేసినట్లు తెలుపుచుండేవాడని తెలిపినారు. ఈ ఆర్థిక భారం నుండి ఉపశమనం కొరకై తన యొక్క సొంత ఇల్లు కూడా గత సంవత్సరంలో విక్రయం చేసి, కొంత అప్పులు తీర్చినాడని వారు తెలిపారు. ఇంకనూ అప్పులు మిగిలి ఉండడం వలన మదన పడుచుండేవాడని దాని కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రభుత్వం నుంచి వారికి అవసరమైన సహాయం కొరకు ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఈ కుటుంబానికి కావల్సిన ఆర్థిక సహాయం మంజూరు కొరకు ప్రభుత్వమునకు ప్రతిపాదనలు పంపుటకు చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దహన సంస్కారములు, ఇతర అవసరముల కొరకు సహాయ సంచాలకుల వారు తమ యొక్క సొంత డబ్బు నుండి 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది అని తెలిపారు. (Story : మృతుని కుటుంబాన్ని పరామర్శించిన చేనేత శాఖ ఏ డి. శ్రీనివాస్ రెడ్డి)