ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు రంగా కుటుంబానికి ఆర్థిక సహాయం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరంలో 39వ వార్డుకు చెందిన చేనేత కార్మికుడు ఉడుముల రంగ అప్పుల బాధ భరించలేక చేనేత మగ్గానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.విషయం తెలిసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు బండారు ఆదినారాయణ,జింకా చంద్రశేఖర్ ల ద్వారా హరీష్ బాబు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. మీ కుటుంబానికి ఎన్ డి ఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు సాకే. ఓబిలేసు,నాగభూషణ, మంజునాథ్, పల్లా నవీన్, రాజేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు రంగా కుటుంబానికి ఆర్థిక సహాయం)