వాలంటీర్లును ఉద్యోగాల్లో కొనసాగించాలి
ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
న్యూస్ తెలుగు/విజయనగరం : విజయనగరం గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లును ఉద్యోగాల్లో కొనసాగించాలని ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు.
సోమవారం ఉదయం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో జిల్లా కన్వీనర్ రవీంద్ర, కో- కన్వీనర్లు మోహన్, ఆదిత్య, కుమారి, దేవిల నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భముగా ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 2 లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టారు, ఆ ఆశలు నమ్మివాలంటీర్లు ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసిన కూటమి ప్రభుత్వం గెలుపుకోసం వారి వంతుగా కృషి చేసారని తెలిపారు. వాలంటీర్ల ఆశల్లో నీళ్ళు చల్లకుండ వారి ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలన్నారు. 2019 లో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులను వాలంటీర్లుగా నియమించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేడయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా సేవలు చేయడం జరిగిందనీ, అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారన్నారు. నాలుగు నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అటెండెన్స్ కూడా వేసుకొనే అవకాశం కల్పించడం లేదనీ అన్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని వాలంటీర్లు అందరికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం వుండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆ హామీ మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల చాలా మంది వాలంటీర్స్ ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలవంతంగా రాజీనామాలు చేసారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరచిపోకుండా వాలంటీర్స్ అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని, గత నాలుగు నెలలుగా ఉన్న బకాయి గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని, రాజకీయ ఒత్తిళ్లుతో రాజీనామా చేసిన వాలంటీర్లను మన్నించి తిరిగి విదుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్లు భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు, క్లాప్ వెహికల్ డ్రైవర్లు యూనయన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.కామేష్, తుపాకుల శ్రీను మరియు విజయనగరం 60 సచివాలయల వాలంటీర్లు పాల్గొన్నారు. (Story: వాలంటీర్లును ఉద్యోగాల్లో కొనసాగించాలి)