రేషన్ లో నిత్యవసర సరుకులు ఇప్పించండి..?
ప్రజాసంఘాల వినతి
న్యూస్ తెలుగు/చాట్రాయి : ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాపుల ద్వారా సరుకులన్నీ ఇప్పించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము ఆనందం సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఇవి శ్రీనివాసరావులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల నాయకులు కొమ్ము ఆనందం సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఈవీ శ్రీనివాసరావులు తహశీల్దారు డి ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కొమ్ము ఆనందం మాట్లాడుతూ. ప్రభుత్వ ప్రజాపంపిణీ వ్యవస్థలో గత కొన్ని నెలలుగా చాట్రాయి మండలంలో అనేక గ్రామాలలో కందిపప్పు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. కచ్చితంగా ప్రతినెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఇవి శ్రీనివాసరావు మాట్లాడుతూ. ప్రస్తుతం ఇస్తున్నవే కాకుండా నిత్యవసర సరుకులు అన్ని రేషన్ షాపులో ఇప్పించాలని డిమాండ్ చేశారు. దసరా దీపావళి వంటి పండుగలకు నిత్యావసరాలు సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. (Story : రేషన్ లో నిత్యవసర సరుకులు ఇప్పించండి..?)