ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటా
బ్యాంకు లోన్లు అందించేందుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తా
వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరపున చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయమని..ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి తాను ఎల్లవేళలా సహకరిస్తానని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోటోగ్రాఫర్లందరూ వారి ఫోటో స్టూడియోలకు ఇన్సూరెన్స్ చేసుకుని ఉండాలని దాంతో ఏదైనా ప్రమాదం సంభవించిన కుటుంబాలకు ఇబ్బంది ఉండదని ఆయన సూచించారు. ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనే ఫోటోగ్రాఫర్లలో అవసరం ఉన్నవారికి బ్యాంకు రుణాలు సైతం మంజూరు చేయించేందుకు తనువంతులు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఫోటోగ్రాఫర్లకు భరోసా కల్పించారు
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ లందరికీ కావలసిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని సైతం సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు
ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇలాంటి క్రీడలలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ పాల్గొనాలని క్రీడలు ఆడడం వలన దేహదారుద్యం సమకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు
చెడు వ్యసనాలను దరిచేరనివ్వకుండా ఉండాలని ఎవరు కూడా చెడు మార్గంలో వెళ్లి కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టకూడదని ఆయన ఫోటోగ్రాఫర్లకు సూచించారు. అనంతరం ఆయన క్రీడాకారులతోపాటు క్రికెట్ ఆడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు (Story : ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటా)