ఎల్ఆర్ఎస్ 2020 లో ఇంటి స్థలాలపై విచారణ చేయాలి : జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య.) : ఎల్ఆర్ఎస్ 2020లో ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన దరఖాస్తులు ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ తెలిపారు. శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు విచారణ ప్రక్రియ నిర్వహణకు నియమించిన రెవెన్యూ, గ్రామ పంచాయతి, ఇరిగేషన్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4980 మంది ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేయగా 367 దరఖాస్తులు విచారణ పూర్తి అయిందని పెండింగ్ ఉన్న 4613 దరఖాస్తులు విచారణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. దరఖాస్తులలో ఎవరైనా డాక్యుమెంట్లు పోర్టల్ లో అప్లోడ్ చేయనట్లయితే ప్రభుత్వం తిరిగి మరలా మొబైల్, మీ సేవా కేంద్రాల ద్వారా రిజిస్టర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులు విచారణ ప్రక్రియ నిర్వహణ కు రెవెన్యూ, పంచాయతి రాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా 19 టీములు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
టీములు తక్షణమే గ్రామాలలో, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు విచారణ చేపట్టాలని ఆదేశించారు. విచారణకు వచ్చిన అధికారులకు ప్రజలు డాక్యూమెంట్లు అందచేయాలని అట్టి దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని ఆయన తెలిపారు.
దరఖాస్తుదారులు సంబంధిత డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోవాలని, విచారణ ప్రక్రియ సజావుగా, సక్రమంగా నిష్పక్షపాతంగా పూర్తి చేయుటకు సహకరించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావ్ , అదనపు కలెక్టర్ రెవెన్యూ మహిందర్ జి ములుగు తాసిల్దార్ విజయ భాస్కర్, ఇ,డి.యం దేవేందర్ , రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఎల్ఆర్ఎస్ 2020 లో ఇంటి స్థలాలపై విచారణ చేయాలి : జిల్లా కలెక్టర్)