ఇసుక లారీలను నియంత్రించాలని ఎస్ఐ కి వినతిపత్రం : రఘు
న్యూస్ తెలుగు /ములుగు : పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ సూచనమేరకు ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చెయ్యాలని, పోలీస్ శాఖ ఏటూరునాగారం ఏ ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ, ఎస్.ఐ కి వినతి పత్రం అందజేసిన్నట్లు ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సి హెచ్. రఘు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఎస్ ఐ కి, వినతిపత్రం అందజేసి, మాట్లాడుతూ ఏటూరునాగారం, మంగపేట మండలాలలో ఎటువంటి ఇసుక క్వారీలు లేవ అని,అయినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చినటువంటి అనుమతితో నేటికీ కొనసాగుతున్న ఇసుక క్వారీలు, మణుగూరు భద్రాచలం, వాజేడు వెంకటాపురం వైపు నడుస్తున్న ఇసుక క్వారీ లారీలు ఏటూరునాగారం వైపు నుండి వెళ్లవద్దని, భద్రాచలం,మణుగూరు వైపు నుండి వస్తున్న లారీలను వరంగల్, నర్సంపేట వైపు తరలించాలని ఆయన కోరారు.అదేవిధంగా ఇల్లందు,వాజెడ్, వెంకటాపురం వైపు నుండి వస్తున్న లారీలను కూడా నర్సంపేట,వరంగల్, హనుమకొండ వైపు నుండి తరలించి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం, ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని,ఇసుక లారీల ద్వారా అంబులెన్స్, వివిధ ప్రయాణికులకు ఇబ్బంది వాటిల్లుతుందని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదేవిధంగా సోషల్ మీడియాలో మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా పార్టీ కార్యదర్శి గుడ్ల దేవేందర్,మండల నాయకులు ఎండీ సలీం, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు ఎండి సులేమాన్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఇసుక లారీలను నియంత్రించాలని ఎస్ఐ కి వినతిపత్రం : రఘు)