క్రికెట్ క్రీడలో ధర్మవరం జట్టు విజయం
టీం లీడర్ శ్రీనివాసులు, కోచ్ రాజశేఖర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఆర్ డి టి లో ఏడీసీఏ నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆడిన క్రికెట్లో ధర్మవరం జట్టు విజయం సాధించిందని టీం లీడర్ శ్రీనివాసులు, కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరంలో హిందూపురం అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తల పడ్డాయి అన్నారు. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 37.3 ఓవర్లలో 213 చేసి ఆలౌట్ అయింది అని,ధర్మవరం జట్టులోని తేజ 92 పరుగులతో సత్తా చాటారన్నారు.హిందూపురం జట్టు బౌలర్ తేజస్విని సాయి 4 వికెట్లు .అనాథరం బ్యాటింగ్‌కి దిగిన హిందూపురం జట్టు 40 ఓవర్లలో 169/8 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 44 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు. హిందూపురం జట్టులోని యష్ 46(83) పరుగులు చేశాడన్నారు. ఈ కార్యక్రమం రసవత్తరంగా కొనసాగింది, అధిక సంఖ్యలో క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. (Story :క్రికెట్ క్రీడలో ధర్మవరం జట్టు విజయం)