రాప్తాడు ఎమ్మెల్యేని కలిసిన ధర్మవరం ఆర్డీవో
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీతమ్మను ధర్మవరం నూతన ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్న మహేష్ అనంతపురంలోని పరిటాల స్వగృహమునందు గౌరవ పూర్వకంగా కలిశారు.ధర్మవరం ఆర్డీవో గా మహేష్ బాధ్యతలు చేపట్టి రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ ని,ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ ని అనంతపురంలోని పరిటాల నివాసంలో గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు. తదుపరి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్లో గల ప్రజలు, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవోను వారు కోరా రు. (Story : రాప్తాడు ఎమ్మెల్యేని కలిసిన ధర్మవరం ఆర్డీవో)