డాక్టరేట్ పొందిన పీవీ సురేష్ బాబు సత్కారం
వినుకొండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారిచే ఇటీవల ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డు పొందిన సామాజ సేవకుడు, బెస్ట్ సోషల్ యాక్టివ్ వర్కర్ అవార్డు గ్రహీత అయిన పీవీ సురేష్ బాబుని సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పర్వీన్ బేగం , హెచ్ వి భానుమతి, హాస్పిటల్స్ సిబ్బంది, అలాగే ఎన్.ఎస్.పి. హాస్పిటల్ పరిధిలో వార్డు హెల్త్ సెక్రటరీలందరూ, ఆశా వర్కర్లు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి వీ సురేష్ బాబు ఈ వార్డు కౌన్సిలర్ గా ఉండటం అలాంటి వ్యక్తిని మేము సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని డాక్టర్ పర్వీన్ అన్నారు. ఈ సందర్భంగా పి వీ సురేష్ బాబు మాట్లాడుతూ ఢిల్లీలో డాక్టరేట్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, అంతకుమించి బాధ్యతను కూడా పెంచింది అని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహకారంతో ఆసుపత్రి అభివృద్ధి లో నేను భాగస్వామి అవుతానని ప్రతినెలా 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు మానవ సేవ సమితి ద్వారా భోజన సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. (Story : డాక్టరేట్ పొందిన పీవీ సురేష్ బాబు సత్కారం)