వినుకొండ లో పలు హాస్టల్స్ ఆకస్మిక తనిఖీ
న్యూస్‌తెలుగు/వినుకొండ: ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు వినుకొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మరియు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్ మహతి, ప్యానల్ న్యాయవాదులతో కలసి విఠంరాజు పల్లి గ్రామంలోని సెయింట్ అన్స్ ఉషోదయ స్పెషల్ స్కూల్, నరసరావుపేట రోడ్ లోని బిసి బాలుర హాస్టల్ స్కూల్ కాలేజ్ , సోషల్ వెల్ఫేర్ బాలికాల హాస్టల్ , సాంఘీక సంక్షేమ బాలికల హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలకు ప్రతీ రోజు అందిస్తున్నా మెను ను పరిశీలించి, మెను సక్రమంగా అమలు అవుతుందా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే తెలియచేయండి అని అడిగారు. స్టోర్ రూమ్ లో సరుకులను పరిశీలించి తగు సూచనలు చేశారు. వంటశాల ను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకొని శుభ్రమైన ఆహారం విద్యార్థులకి అందించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు . హాస్టల్ లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఇప్పటి నుండి సమయపాలన పాటించాలి అని,బాగా చదవాలి అని, మంచి క్రమ శిక్షణ కలిగి ఉండాలి అని బాగా చదివి తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని డిసిప్లైన్,సమయపాలన, క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలి అని విద్యార్థులు బాగా చదివి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని , ఇప్పటి నుండి భవిష్యత్తు కు పునాది వేసుకోవాలి అని న్యాయ మూర్తి మహతి తెలిపారు.. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, పి.వి. రమణ రెడ్డి, ప్యానల్ న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బంది,పాల్గొన్నారు. (Story : వినుకొండ లో పలు హాస్టల్స్ఆ కస్మిక తనిఖీ)