పాడి రైతుల సమస్యలపై వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని పాడి రైతులు సమస్యలపై వినుకొండ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ హెచ్ సరోజిని దేవి కి, రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకి వివరించడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించి పాడి రైతులకు ఏ ఒక్క సమస్య వచ్చిన 1962 నెంబర్ కి ఫోన్ చేసి చెప్పినట్లయితే వెంటనే ఆ సమస్యపై ఆమె స్పందిస్తానని చెప్పారు.. అదే విధంగా మొబైల్ వెహికల్ కూడా పాడి రైతుల కోసం అందుబాటులో ఉందని దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. వెంటనే ప్రభుత్వాం దృష్టికి తీసుకెళ్లి టిఎమ్ఆర్ దానను పాడిరైతులకు త్వరలో అందించే విధంగా చూస్తానని ఆమె పాడి రైతులకు హామీ ఇచ్చారు.. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. రైతుల కోసం రైతుల అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని ప్రతినిత్యం రైతుల సమస్యలను తెలుసుకొని పోరాడే సంఘం మన సంఘం అని, ఆ సంఘంలో ప్రతి ఒక్క రైతు సభ్యుడిగా చేరి తన సమస్యలతో పాటు పరుల సమస్యలను కూడా పరిష్కరించడంలో మీరు కూడా మాకు చేయూతనివ్వాల్సిందిగా రాము రైతులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వెనిగళ్ళ బాలాజీ లింగారామయ్య, షేక్ నగర కంటి చిన్న కాసిం ,పేర్లపాడు ఖలీల్ , గాలం బ్రహ్మం , నాసరమ్మ కాజమ్మ , వరగాని మాధవి , ఏసోబు, మస్తాన్బీ , సుభాన్ బి, మున్ని అరుణ లక్ష్మి, అనేకమంది రైతులు పాల్గొన్నారు. (Story : పాడి రైతుల సమస్యలపై వినతి పత్రం)