ఆటల పోటీల్లో గీతమ్స్ విద్యార్థుల ప్రతిభ
న్యూస్‌తెలుగు/వినుకొండ : సెప్టెంబర్ 23 24 తేదీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆటల పోటీలలో అండర్ 14, అండర్ 17 స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకుని జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక కాబడ్డారని పాఠశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభ కు గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. అండర్ 14 విభాగంలో ఖో,ఖో ఆట కు ఎం యోగి రంజిత్, కే అక్షిత్ ,పి అభిరామ్ అర్హత సాధించగా అండర్ 17 విభాగంలో ఖో,ఖో ఆట లో ఎన్ సాయి చరణ్ రెడ్డి ,ఎం అభినాష్ రెడ్డి ,ఎస్ ప్రమోద్, కే ఎల్ వి సాయి గణేష్, కె అభిలాష్ రెడ్డి లు అర్హత సాధించారు. అదేవిధంగా అండర్ 17 వాలీబాల్ విభాగంలో ఏ బాల నందీశ్వర్ రెడ్డి, ఎల్ ఆనంద్ అర్హత సాధించగా, అథ్లెటిక్ విభాగంలో 800 మీటర్లలో ప్రథమ స్థానం 1500 మీటర్లలో ద్వితీయ స్థానాన్ని ఎన్ సాయి చరణ్ రెడ్డి సాధించడం జరిగింది. అండర్ 17 విభాగంలో లాంగ్ జంప్ తృతీయ స్థానాన్ని ఎం మనోహర్ సాధించారని కరస్పాండెంట్ కోటిరెడ్డి తెలియజేశారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్, గోపి, సాల్మన్, వీరాంజనేయులు పాల్గొన్నారు. (Story : ఆటల పోటీల్లో గీతమ్స్ విద్యార్థుల ప్రతిభ)