ప్రపంచ హృదయ దినోత్సవం వేళ బాదంపప్పులకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ : ప్రపంచ హృదయ దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. ఈమధ్య భారతదేశం సివిడి కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. 45 ఏళ్లు దాటిని వారిలో 29.4% మందికి హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమాలు పెరుగుతున్నాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడటానికి మన రోజువారీ ఆహారంలో బాదం వంటి గుండె-ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం అవసరమని నిపుణులు చెపుతున్నారు. గుండె జబ్బులకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో బాదం ఒక శక్తివంతమైన తోడ్పాటుగా ఉంటుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో హృదయానికి ప్రయోజనాన్ని బాదం అందిస్తుంది. కొన్ని బాదంపప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆహార నిపుణులు చెపుతున్నారు. (Story : ప్రపంచ హృదయ దినోత్సవం వేళ బాదంపప్పులకు ప్రాధాన్యత)