Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మట్టి గణపతి పూజ చేయండి.

మట్టి గణపతి పూజ చేయండి.

0

మట్టి గణపతి పూజ చేయండి

ప్రకృతి పర్యావరణాన్ని కాపాడండి

హనుమాన్ టెకిడ్ మట్టి గణపతినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు.

న్యూస్‌తెలుగు/వనపర్తి:హనుమాన్ టేకిడ్ బాలంజనేయ యూత్ ప్రతిష్టించిన మట్టి గణపతికి మాజీ చైర్మన్,కౌన్సిలర్ బండారు.కృష్ణ గార్ల ఆహ్వానం మేరకు సింగిరెడ్డి వాసంతి నిరంజన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుటకై మట్టి గణపతులను ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు. ఆ విఘ్నేశ్వరుడు ప్రజలందరిని అష్టఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో చూడాలని ప్రార్థించారు. ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నిరంజన్ రెడ్డి దంపతులను బాలాంజనేయ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి.శ్రీధర్,కౌన్సిలర్ ఉంగ్లమ్.అలేఖ్య తిరుమల్,గంధం.పరంజ్యోతి, డాక్టర్.డ్యానియల్, స్టార్.రహీమ్,చిట్యాల.రాము,బండారు. భరత్,శ్రీకర్ గౌడ్,అభిషేక్,శేషికాంత్, సూర్యకుమార్,వినయ్,గిరి,ఖాదర్శా,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story:మట్టి గణపతి పూజ చేయండి.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version