51 మంది పైన బైండ్ వర్ కేసులు
న్యూస్ తెలుగు/సాలూరు : బుధవారం సాలూరు పట్టణంలో 51 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి MEM కోర్టు MRO సాలూరు గారి వద్ద హాజరు పరిచి సత్ప్రవర్తతనతో వుండేందుకు గాను ఆదేశాలు జారీ చేయడమైనది మరియు బైండ్ వర్ ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రవర్తిస్తే వారిపై 2 లక్షలు జరిమానా విధిస్తూ అంతేకాకుండా చట్ట విరుద్ధ పనులు చేసేవారిగా గుర్తుస్తూ తదుపరి చర్యలు తీసుకోబడతాయి అని హెచ్చరించటం జరిగింది. వీరంతా పట్టణ పరిధిలో నాటు సారా అమ్మకాలు చేసేవారు, వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పాత కేసులలో గొడవలుకు కారకులు మరియు శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వారిగా గుర్తించడమైనది. ఈ సందర్భంగా సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తాహసిల్దార్ ఎన్ వి రమణ 51 మందికి తగు సూచనలు మరియు హెచ్చరికలు జారీచేయడమైనది. రాబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అల్లర్లు సృష్ఠించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గుర్తుచేయడమైంది.(Story : 51 మంది పైన బైండ్ వర్ కేసులు)