చతిస్గడ్ కు వెళ్లే జాతీయ రహదారి ముసివేత..
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలి
ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) :
గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పేరూరు సమీపంలో గల టేకులగూడెం వద్ద ఎన్ హెచ్ 163 జాతీయ రహదారి మీదుగా రేగు మాకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, ప్రత్యామ్నాయంగా భూపాలపల్లి మీదుగా వెళ్లగలరని. ఏటూరు నాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.తెలియజేశారు.ఇ సందర్భంగా ఏ ఎస్పీ శివం ఆయన మాట్లాడుతూ
ఏటూరు నాగారం. ఓడగూడెం. ఎస్సీ కాలనీ. రామన్నగూడెం. రాంనగర్. లంబాడి తండా. ఎక్కెల భూటారం. చల్పాక. ఎలిసేటిపల్లి. మంగపేట .వాజేడు. వెంకటాపురం. కన్నాయి గూడెం. ముప్పు ప్రాంతాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ముప్పు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తునందున ప్రయాణాలు చేయవద్దని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీవర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ప్రజలు స్వచ్చందంగా, ఖాళీ చేయాలని, సూచించారు
ఎడతెరిపి లేని వర్షాల వల్ల అన్ని చెరువులు, వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయని, చెరువులు, వాగులు చూసేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు.
కురుస్తున్న వర్షాలకు చిన్నా, పెద్ద చెరువులు, వాగులు నిండుకుని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు, సెల్ఫీలు, ఫోటోల కోసం ప్రజలు వస్తుంటారని, నీటి ప్రవాహం వల్ల ప్రమాదం పొంచి ఉందని, పడిపోయే అవకాశాలున్నాయని, ఎవరూ వెళ్ళొద్దని అన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాలని అన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు. పశువులను మేతకు బయటికి వదలొద్దని ఆయన తెలిపారు.
విపత్కర పరిస్థితిల్లో ప్రజలు పోలీస్ యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని ఏ ఎస్పీ శివ ఉపాధ్యాయ సూచించారు.
భారీ వరదలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం ఉండాలి అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏటూరు నాగారం సబ్ డివిజన్ పరిధిలో నీటి వనరులు అందులోని నీటి నిల్వ పరిస్థితి, చెరువు కట్టలు మొదలవు వాటిని పోలీసు అధికారులు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోందని, ఈ వరద వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు, రహదారుల గురించి, సమాచారం ప్రజలకు చేరవేస్తూ. ఆ ప్రాంతంలో రవాణా నియంత్రణ చర్యలు. చేపడుతూ ముంపు ప్రాంతాల ప్రజలను ఎగువ సురక్షిత ప్రదేశానికి తరలించేoదుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
గర్భిణీలను గుర్తించి వైద్య సేవలకు,ఆసుపత్రులకు తరలింపు,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తమ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ముంపు సమస్యలపై
శ్రద్ధ వహించాలని,ఏదైనా అత్యవసర పరిస్థితులను తన దృష్టికి తేవాలని,ఆయా మండలాల్లోని పోలీస్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సి. ఐ. అనుముల శ్రీనివాస్, ఎస్. ఐ. తాజు ద్దీన్, పాల్గొన్నారు (Story : చతిస్గడ్ కు వెళ్లే జాతీయ రహదారి ముసివేత..)