Home వార్తలు తెలంగాణ వరద తీవ్రత కారణంగా టేకులగూడెం వద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 ముసివేత

వరద తీవ్రత కారణంగా టేకులగూడెం వద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 ముసివేత

0

వరద తీవ్రత కారణంగా టేకులగూడెం వద్ద

జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 ముసివేత

జిల్లా ఎస్పీ శబరిష్

న్యూస్ తెలుగు /ములుగు : గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా పేరూరు సమీపంలో గల టేకులగూడెం వద్దఎన్ హెచ్ 163 జాతీయ రహదారి మీదుగా రేగు మాకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని,జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రకటనలో జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ వరంగల్ మీదుగా భూపాలపట్నం వెళ్లేవారు గూడెప్పాడ్ క్రాస్ వద్ద,ఎడమకు తిరిగి భూపాలపల్లి మహదేవ్పూర్ కాటారం మీదుగా భూపాలపట్నం చతిస్గడ్ వెళ్లవలసిందిగా కోరారు.
ఇప్పటికే ములుగు దగ్గరలో చేరుకున్న వారు జంగాలపల్లి, వెంకటాపూర్, వెళ్తుర్లపల్లి, భూపాలపల్లి మీదుగా, భూపాలపట్నం చతిస్గడ్ వెళ్లవలసిందిగా ఎస్పీ పేర్కొన్నారు. (Story : వరద తీవ్రత కారణంగా టేకులగూడెం వద్ద జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 ముసివేత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version