జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు : అప్పయ్య
న్యూస్ తెలుగు /ములుగు : జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణ దృష్ట్యా , ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందున,శుక్రవారం ములుగు మండలం చిన్న గుంటూరు పల్లెలో డాక్టర్ రవళి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తనిఖీ చేశారు.అంతకుముందు గ్రామంలో వీధుల వెంబడి పర్యటించి, 20 ఇళ్లను వైద్యురాలు డాక్టర్ రవళి, మరియు ఏఎన్ఎం ఉమా, తిరుపతమ్మ లతో కలిసి డియం హెచ్ఓ,ఇళ్లల్లో మీరు నిల్వ ఉన్న పాత్రలను ,దోమ యొక్క లార్వా ఉందా లేదా అని పరిశీలించారు.ఈ పరిశీలనలో ఐదు ఇళ్లల్లో లార్వా ఉన్నట్లు గుర్తించి, ఆశాను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి,మందలించడం జరిగింది.
అలాగే సంబంధిత ఇంటి యజమానులకు, కుటుంబ సభ్యులకు లార్వా యొక్క పెరుగుదల, వాటి వల్ల దోమలు పెరిగి, వ్యక్తుల అనారోగ్యానికి కారణమవుతుందని అప్పయ్య తెలిపారు.అనంతరం అవగాహన కల్పించారు . తర్వాత సీతారామాంజనేయ అన్నదాన ఆశ్రమం దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 25 మందికి వైద్యం అందజేయడం జరిగింది. వీరిలో ఎవరికి జ్వరం లేదని బిపి,షుగర్,కిళ్ల నొప్పులు మాత్రమే ఉన్నట్లు డి ఎం ఎన్ హెచ్ ఓ గుర్తించారు. జిల్లాలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం పేర్కొన్నారు.మొత్తం క్యాంపులు ఇప్పటివరకు 197 క్యాంపు నిర్వహించగా,9158 ఓపి చూసి,అందులో కేసులు 965 గా గుర్తించడంజరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమా,తిరుపతమ్మ,హెల్త్ అసిస్టెంట్ భాస్కర్,ఆశ కవితలు పాల్గొన్నారు. (Story : జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు : అప్పయ్య)