యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు
జిల్లా స్థాయి టీచర్స్ షటిల్ బ్యాట్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, టోర్నమెంట్, పరుగు పందెం పోటీలు
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సత్యసాయి జిల్లా శాఖ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో యుటిఎఫ్( 50 సంవత్సరాల ) స్వర్నోత్సవ సంబరాల సందర్బంగా జిల్లా స్థాయి , బాస్కెట్ బాల్ , షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ మరియు 100,200, మీ రన్నింగ్ 400 మీ వాకింగ్, షాట్ పుట్, జవాలిన్ త్రో, క్యారమ్స్ మొదలైన వాటిలో పురుషులకు క్రీడా పోటీలు ఈనెల 8వ తేదీన ఆదివారం మడకశిర పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడునని ధర్మవరం యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ అలాగే కేవలం సత్య సాయి జిల్లా మహిళా టీచర్స్ కొరకు. ఈనెల 14వ తేదీన రెండవ శనివారం కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు మహిళా టీచర్స్ కొరకు షటిల్, త్రో బాల్, షాట్ పుట్,స్పీడ్ వాక్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించబడునని తెలియజేశారు. సత్య సాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు,లక్ష్మయ్య, హరికృష్ణ, రాంప్రసాద్, సాయి గణేష్,, రామాంజనేయులు, అమర్ నారాయణరెడ్డి, వినయ్ కుమార్, శివయ్య, గోపాల్ రెడ్డి, సకల చంద్రశేఖర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు)