పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం
యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేదలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం,కోశాధికారి బండి నాగేంద్ర, క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ సర్కిల్లో గల నేత్రాలయ ఐ క్లినిక్ లో యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా వారి సౌజన్యంతో, నేత్రాలయ ఐ క్లినిక్ వారి సహకారం, పుష్పగిరి కంటి ఆసుపత్రి కడప వారిచే ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, కంటిని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కంటి ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కారుల ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 45 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ ఉచిత రవాణా ఖర్చుతో పాటు ఉచిత భోజనము వసతి, ఆపరేషన్ నిర్వహిస్తూ ఉచితంగా అద్దాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజా చారి, డాక్టర్. బి వి. సుబ్బారావు, చాంద్ భాషా, పోలా ప్రభాకర్, ఓవి ప్రసాద్, గర్రె రమేష్ బాబు తదితర సభ్యులు పాల్గొన్నారు. (Story : పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం )