ప్రత్యేక పూజలు అందుకున్న కార్యసిద్ధి వీరాంజనేయ స్వామి
ఆలయ అభివృద్ధి కమిటీ
న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని శివానగర్ లో వెలసిన కార్యసిద్ధి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అర్చకులు సోమ సుందర శర్మ ప్రత్యేక పూజలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడమ నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ శనివారం అనేది ఆంజనేయస్వామికి ప్రీతి దినము కావున, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి మనిషికి ధైర్యం ఎంతో అవసరమని, ఆ ధైర్యం ఆంజనేయస్వామి వలన వస్తుందని తెలిపారు. తదుపరి అర్చకులు భక్తాదుల పేరిట అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వీరాంజనేయ స్వామికి వివిధ పూలమాలలతో పాటు, తులసి, తమలపాకు, వడమాల తో చేసిన అలంకరణ పక్కాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భక్తదలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : ప్రత్యేక పూజలు అందుకున్న కార్యసిద్ధి వీరాంజనేయ స్వామి)