Home వార్తలు తెలంగాణ అభివృద్ధి పేరుతో అంతా శిథిలం

అభివృద్ధి పేరుతో అంతా శిథిలం

0

అభివృద్ధి పేరుతో అంతా శిథిలం

పదేళ్ల పాలనలో పాఠశాలలకు మరుగుదొడ్లు కరువు

న్యూస్‌తెలుగు/వనపర్తి : శిధిలావస్తలో ప్రభుత్వ ఆసుపత్రిలోని పలు విభాగాలు పరిశీలించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆసుపత్రి అభివృద్ధి, కళాశాల పటిష్టం కోసం కావలసిన నివేదికలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించి ఆసుపత్రిలో గల సమస్యలను గుర్తించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో ఆసుపత్రి సందర్శించారు. ఆసుపత్రిలోని పలు విభాగాలలో కురుస్తున్న వర్షపు నీటి సమస్యలపై అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కావలసిన నివేదికలను వెంటనే తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించే జిల్లా ఆస్పత్రి ఈ తరహాలో ఉంటే ప్రజారోగ్యాన్ని ఏ విధంగా కాపాడగలమని అధికారులను ఆయన ప్రశ్నించారు. సత్వరమే ప్రభుత్వాసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి కావలసిన నివేదికలను తయారుచేసి తన అందించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి పరిశీలించారు.
కళాశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ గత పదేళ్ల క్రితం నూతన మరుగుదొడ్లు నిర్మించిన అవి నిరుపయోగంగా ఉన్నాయని వాటి వలన విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి శ తీసుకొచ్చారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు మాట్లాడుతూ 15 రోజుల్లో కళాశాలలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో నివేదికలు తయారుచేసి ఇవ్వాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. URS పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంను ఆయన పరిశీలించి నాణ్యవంతైన ఆహారాన్ని విద్యార్థులకు కందించాలనీ వారికి సూచించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వైద్యం విద్య పై ప్రత్యేక దృష్టి సారించాలని అందుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు (Story : అభివృద్ధి పేరుతో అంతా శిథిలం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version