కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా కులగణన చేసిన తరువాతనే ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికలకు పోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు.
దేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచాయి వాటి స్థానే తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల కు పోవాలని, ఈ విషయాన్ని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయానా ప్రకటించి అన్ని కులాలకు న్యాయం చేస్తానని చెప్పారని కానీ దాన్ని అమలు పరచకుండా ఎన్నికలకు పోతే చాలా వ్యతిరేకత వస్తుందని, కులగణన చేసే సమయం నెలన్నర కూడా పట్టదని కనుక వెంటనే కులగణన చేయాలని అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయని దానిలో అధికార పార్టీ సభ్యులే ఎక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఒకే వర్గానికి మేలు జరిగిందని వాదన ఉందని కనుక ఎక్కువ శాతం ఉన్న వారికి తక్కువ సీట్లు వస్తున్నాయని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో 10 సీట్లు ఏకంగా అగ్రవర్ణాలకే చెందాయని రెండు రిజర్వు ఎస్సీలకు ఉన్నాయని మిగతా కులాలకు వర్గాలకు నిరాశే ఎదురయిందని కనుక జిల్లాపరిషత్ నుండి ఎంపీపీ, జెడ్పి.టి.సి, మున్సిపల్ చైర్మన్లు అధిక శాతం కింది స్థాయి వారికి రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు టిడిపి రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్, బీఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, నాయకులు బొడ్డుపల్లి సతీష్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, రమేష్, రాములు పాల్గొన్నారు. (Story : కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దు)