అర్హత ఉన్న ప్రతి రైతు కు రైతు భీమా చేయించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అర్హత ఉన్న ప్రతి రైతు కు రైతు భీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ శాఖ అధికారులతో క్రాప్ బుకింగ్, రైతు భీమా పై సమీక్ష నిర్వహించారు.
క్రాప్ బుకింగ్ ఆఫిస్ లొ కూర్చోనీ లేదా గ్రామాలలో ఒక చోట కూర్చొని చేయవద్దని, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పొలం వద్ద వెళ్లి రైతు తో మాట్లాడి వారి పాస్ బుక్ ఆధారంగా క్రాప్ బుకింగ్ చేయాలన్నారు. అలా కాకుండా ఎక్కడో కుర్చీని క్రాప్ బుకింగ్ చేసినట్లు తెలిస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఏ ఒక్క రైతు నా పొలం వద్దకు రాలేదు, నాతో మాట్లాడలేదు అని ఫిర్యాదు వస్తె చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా క్రాప్ బుకింగ్ పకడ్బందీగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
క్రాప్ బుకింగ్ పకడ్బందీగా ఉంటేనే ఎరువు సరఫరా కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు సమస్యలు లేకుండా చేసుకోవచ్చన్నారు.
అర్హత ఉన్న ప్రతి రైతు కు రైతు భీమా చేయించాలని, జిల్లాలో ఏ ఒక్క రైతు రైతు భీమా లేకుండవుండటానికి వీలు లేదన్నారు. భీమ చేయని రైతులకు నోటీసులు పంపాలని జిల్లాలో వంద శాతం రైతు భీమా చేసి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో మండలాల వారీగా ఎరువుల నిల్వల పై ఆరా తీశారు. ఎక్కడైనా తక్కువగా ఉంటే వెంటనే ఇండెంట్ పెట్టాలని సూచించారు.
రుణమాఫీ అందని ఫైర్యదుదారుల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు అకౌంట్ నెంబరు లో సున్న రాయని ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ పేరులో ఉన్న చిన్న మార్పు వంటి సమస్యలను త్వరగ పరిష్కరించేందుకు కృషిచేయాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్, ఏ.డి. ఏ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : అర్హత ఉన్న ప్రతి రైతు కు రైతు భీమా చేయించాలి)