క్రీడలు జీవితంలో భాగం కావాలి
– జిల్లా స్థాయి టైక్వాండో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా స్థాయి 17వ చాంపియన్ షిప్ టైక్వాండో పోటీలను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు.
ఆదివారం స్థానిక తోటపాలెంలో ఉన్న గాయత్రి విద్యా సంస్థలు లో జరిగిన పోటీలను అదితి గజపతిరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
క్రీడలు అనేవి జీవితంలో భాగం కావాలన్నారు.ఆత్మ రక్షణతో పాటు,క్రమశిక్షణ, పట్టుదల మానసిక ధైర్యం ఏర్పడతాయన్నారు. తైక్వాండో అనేది మరింత ఆత్మ రక్షణకు తోడ్పడే క్రీడా అన్నారు.క్రీడలో బాగా రాణించి మంచి స్థాయికి వెళ్ళాలని క్రీడాకారులను ఆశీర్వదించారు.
టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు గురానఅయ్యలు మాట్లాడుతూ 17 వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా వ్యాప్తంగా 170మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి పోటీలు లో విజేతలుగా నిలిచిన వారిని,ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి అనంతపురం లో జరగనున్న రాష్ర్ట స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సతీమణి సింధు, తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సి హెచ్ వేణుగోపాలరావు, ఛైర్మన్ సుభాష్ చంద్ర బోస్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడలు జీవితంలో భాగం కావాలి)