కొండకరకం గ్రామంలో సీతం ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎన్. ఎస్. ఎస్. యూనిట్ ప్రత్యేక శిబిరం కొండకరకం గ్రామంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమైనది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా సర్పంచ్ రాంబాబు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రతి విద్యార్థి ఎన్.ఎస్.ఎస్.లో చేరాలని పిలుపునిచ్చారు.
సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ పుస్తకం ద్వారా విద్యనందిస్తే సరిపోదని, ఆచరణాత్మక శిక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి,ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్. సతీష్ కుమార్, ఎన్.ఎస్.ఎస్ క్యాడెట్స్, ఉన్నత పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. (Story: కొండకరకం గ్రామంలో సీతం ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!