తిరుపతి రెడ్డికి సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వారి కుటుంబం దర్శనార్థం శ్రీరంగాపూర్ టెంపుల్ రావడం జరిగింది వారిని ఆహ్వానించి పూజ తర్వాత ఆలయంలోనే శాలువాతో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సత్కరించారు.
శ్రీరంగాపురం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నేను చదువుతూనే క్రమంలో ప్రతి సంక్రాంతికి మా ఫ్యామిలీతో శ్రీరంగాపురం వచ్చేవారమని ఇప్పుడు కూడా దైవదర్శనానికి రావడంతో ఎవ్వరికీ చెప్పీ రాలేదని చెప్పారు. మాతో కలివిడిగాగా మాట్లాడుతూ భవిష్యత్తులో వనపర్తికి మీరు మరింత కృషి చేయాలని ఉద్గాటించారు . ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు, శ్రీరంగాపురం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. (Story : తిరుపతి రెడ్డికి సన్మానం)