బి.సి.ఉద్యోగుల సమాఖ్య ( BCEF ) రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కట్టా యుద్ధవీర్ నియామకం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రొఫెసర్ కట్ట యుద్ధ వీర్ ని వెనుకబడిన కులాల ఉద్యోగుల సమాఖ్య ( BCEF ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెనుకబడిన కులాల సమాఖ్య ( బి సి ఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసి నియామక పత్రం అందజేశారు. ప్రొఫెసర్ కట్ట యుద్ధవీర్ M.TECH IIT మద్రాసులో చదివి పట్టా పొందినారు వీరు ప్రస్తుతము ఐదు కళాశాలలకు ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు గతంలో భారత రక్షణ శాఖలో సైంటిస్ట్ గా రిలయన్స్ , సత్యం కంప్యూటర్స్ తదితర కార్పొరేట్ సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు ప్రస్తుతము బీసీ ఉద్యోగులకు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటం కోసం బీసీఈఎఫ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారని బిసిఎఫ్ లో చేరుతున్నానని సగర్వంగా చెప్పారు బి సి ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రొఫెసర్ కట్ట యుద్ధవీర్ గారికి సాధారంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. (బి.సి.ఉద్యోగుల సమాఖ్య ( BCEF ) రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కట్టా యుద్ధవీర్ నియామకం)