పల్లెల్లో ప్రభుత్వ వైద్యం పటిష్టపరిచేందుకు
ప్రత్యేక చర్యలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం ఇరిగేషన్ పై ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రభుత్వ పరంగా అందించే వైద్యం మెరుగ్గా అందించేందుకు తగిన చర్యలు చేపట్టిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పద్మభూషణ్ డాక్టర్ ప్రసాద్ రావు గారి సారధ్యంలో జన విజ్ఞాన వేదిక సంస్థ సోమవారం వనపర్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వైద్య అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రసాద్ రావు ని పూలమాలలు శాలువా జ్ఞాపకలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం పరిధిలో వైద్య సేవలను బలోపేతం కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశామని జిల్లా కేంద్రానికి 502 బిడ్డ నూతన ఆసుపత్రి మంజూరు అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక చేపట్టే కార్యక్రమాలకు తాను ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు
కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి, జన విజ్ఞాన వేదిక సమన్వయకర్త నరేందర్, నారాయణ, జితేందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (sTORY : పల్లెల్లో ప్రభుత్వ వైద్యం పటిష్టపరిచేందుకు ప్రత్యేక చర్యలు)