UA-35385725-1 UA-35385725-1

చేతి ఉత్పత్తుల శిక్షణ ప్రదర్శన ప్రారంభం

చేతి ఉత్పత్తుల శిక్షణ ప్రదర్శన ప్రారంభం

నల్లగొండ బ్యూరో (న్యూస్‌తెలుగు) : నల్గొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మహిళలకు ఆదివారం వివిధ వ్యర్ధాలతో రూపొందించిన చేతి ఉత్పత్తులశిక్షణ ప్రదర్శనను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పురుషుల సంపాదన ఒక్కటే కుటుంబానికి సరిపోదని, అందువల్ల మహిళలు ఆదాయం ఇచ్చే ఉపాధి కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం ఉందని అన్నారు. పేదలకు చేదోడుగా నిలిచి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ వ్యర్ధాలతో ఉత్పత్తుల తయారీలో వారి నైపుణ్యలను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను ఇచ్చి వారిలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు 30 కోట్ల రూపాయలతో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన పనులకు ఇటీవలే శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.అలాగే నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని మహిళలందరికీ ప్రత్యేకించి స్వయం సహాయక మహిళలకు వివిధ వస్తువుల తయారీలో నైపుణ్య అభివృద్ధికై తనతో పాటు, ప్రభుత్వపరంగా,అలాగే దాతల సహకారంతో ఆదాయం వచ్చే కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ వ్యర్థాలతో టీ కప్పులు తయారుచేసే మిషన్ కు అవసరమైన 15 లక్షల రూపాయలను తన సొంత నిధుల నుండి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టిటిడిసిలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వివిధ వ్యర్థాలతో మహిళలు తయారుచేసిన సుమారు 20 రకాల వస్తువులు ప్రదర్శనలో ఉంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పటివరకు 17 కోట్ల మంది ప్రయాణించడం జరిగిందని తెలిపారు. రెండు నెలల్లో గృహలక్ష్మి పథకాన్ని అమలులోకి రానుందని, మరో 10,15 రోజుల్లో 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల పథకం తీసుకురానున్నమని తెలిపారు .మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ ,ఎస్టీ విద్యార్థినిలకు కొత్త కోర్సులను నేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.

జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ, మహిళలందరూ స్వయంగా ఆర్థిక కార్యక్రమాలు చేసుకున్నప్పుడే స్వయం సమృద్ధి సాధిస్తారని అన్నారు. జిల్లాలో మహిళా స్వయం సహాయక బృందాల కార్యక్రమాలను చురుకుగా, నిర్వహిస్తున్నామని అయితే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ,ఇందుకుగాను ఒక్కొక్కరు గా కాకుండా గ్రూపుగా ఏదైనా సాధించవచ్చు అని అన్నారు. మహిళలు చేపట్టే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, బై బ్యాక్ విధానంలో అమ్మకం చేసేందుకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని, గ్రూపుగా మహిళలు కార్యక్రమాలను చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో నిమ్మ, మిల్లెట్స్ లాంటి వాటిపై ఎక్కువ ఉత్పత్తులు చేపడితే వాటికి మంచి మార్కెట్ ఉందని తెలిపారు. డిఆర్డిఓ పిడి కాలిందిని మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలను వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డిఓ రవి, మెప్మా పీడీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాగా బెంగళూరు ఆధారిత హెడ్ హోల్డ్ హై అనే సంస్థ మహిళల జీవనోపాదులను పెంపొందింపజేసేందుకు వ్యర్ధాలతో చేతి ఉత్పత్తులను తయారు చేసే శిక్షణను ఇవ్వడమే కాకుండా, బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చి ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సుమారు 20 రకాల వ్యర్థాలతో తయారుచేసిన చేతి వృత్తులను ప్రదర్శనలో ఉంచారు. (Story: చేతి ఉత్పత్తుల శిక్షణ ప్రదర్శన ప్రారంభం)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1