UA-35385725-1 UA-35385725-1

త్రివిక్ర‌మ్ మూవీలో మ‌హేష్ కొత్త స్టైల్‌!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం 
*ఆగస్టు నుంచి రెగ్యులర్  షూటింగ్ 
*2023 వేసవి లో చిత్రం విడుదల
*నేడు ప్రచార చిత్రం విడుదల
Mahesh babu: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు.
మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్  ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్  షూటింగ్ ఆగస్టు లో   ప్రారంభమవుతుంది. ఈ  సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.
ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగత మవుతుంది.
మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ  ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా  ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త    అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
 ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ  ఈ సందర్భంగా తెలిపారు.  టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు),
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌. (Story: త్రివిక్ర‌మ్ మూవీలో మ‌హేష్ కొత్త స్టైల్‌!)

See Also: 

‘రారా రెడ్డి’ సాంగ్‌లో దుమ్మురేపిన అంజలి

మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ

‘మేజర్’ ఓహ్ ఇషా… వీడియో సాంగ్ విడుదల

ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

అలెర్ట్‌: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్‌!)

నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

Mahesh-Trivikram’s movie to go on floors

Rashmika in hijab-clad

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Chaging Movie Trailer

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1