UA-35385725-1 UA-35385725-1

పెట్టుబ‌డుల‌కు ఏపీ అనుకూలం: దావోస్‌లో సీఎం

పెట్టుబ‌డుల‌కు ఏపీ అనుకూలం: దావోస్‌లో సీఎం

తయారీ రంగంలో అత్యాధునికత
అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీ
మార్గనిర్దేశంకోసం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో ఏపీ ఒప్పందం
కాలుష్యంలేని ఇంధనాలపై సీఎం ప్రత్యేక దృష్టి
పలువురితో చర్చల్లో పంప్‌డ్డ్‌స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై చర్చలు
రాష్ట్రంలో మౌలికసదుపాయాల అభివృద్ధిపై వివరించిన సీఎం
పోర్టు ఆధారిత పారిశ్రామీకరణపైనా చర్చల్లో ముఖ్యమంత్రి దృష్టి
విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు
పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు

తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా ముఖ్యమంత్రి
పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు
కాంగ్రెస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం సమావేశం
అక్కడే డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో సీఎం భేటీ. ఆరోగ్య రంగంపై చర్చ
తర్వాత ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం
రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌
ఏపీ పెవిలియన్‌లోనే డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం భేటీ
డబ్ల్యూఈఎఫ్‌ ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం.
ఆతర్వాత బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ
సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే
ముఖ్యమంత్రితో సమావేశమైన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ

దావోస్‌: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా,
అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్‌ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. పంప్‌డ్డ్‌స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై పలువురితో చర్చింరారు.
విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై వీరు ప్రశసంలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని వారు కొనియాడారు.
వరుస సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ సెంటర్లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయిన ప్రొఫెసర్‌ క్లాజ్‌ అన్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించగలదన్నారు.

అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్‌ ష్వాప్‌ ఆహ్వానించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్‌ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలను చర్చించారు. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు. సోషల్‌ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ వేదికద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని వివరించారు.

2. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్‌ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైనా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2వేల జనాభాకు వైయస్సార్‌ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు.

3. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్‌ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆతర్వాత వివిధ ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు.

4. డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయిన్‌ బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తోనూ సీఎం, ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశిత చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్‌చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌స్టోరేజీ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని సీఎం వివరించారు. విండ్, సోలార్, హైడల్‌.. ఈమూడింటిని కూడా సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని సీఎం వివరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.

5. తదుపరి సీఎం… బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్‌వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ ప్రశంసించారు. నైపుణ్యమానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

6. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్‌ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్‌ ఏర్పాటు చేసింది.

7. తర్వాత ముఖ్యంత్రి అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. (Story: పెట్టుబ‌డుల‌కు ఏపీ అనుకూలం: దావోస్‌లో సీఎం)

See Also: 

మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ

‘మేజర్’ ఓహ్ ఇషా… వీడియో సాంగ్ విడుదల

ఆ నలుగురికీ రాజ్యసభ సీట్లు

మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!

లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!

దుమ్మురేపిన వ‌ర‌ల‌క్ష్మి! వీడియో

అలెర్ట్‌: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్‌!)

నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన

పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!

మసీదులో శివలింగం

అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

ఆ నటిని భర్తే చంపేశాడు?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Chaging Movie Trailer

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1