UA-35385725-1 UA-35385725-1

నమ్మిన స్నేహితుడే దగా : తల్లీకుమారుడు ఆత్మాహుతి

నమ్మిన స్నేహితుడే దగా : తల్లీకుమారుడు ఆత్మాహుతి

Crime News: ఎంతగానో నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడవడంతో తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో జరిగింది. ఓ లాడ్జిలోని గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులకు కారణమైన వారిలో స్నేహితుడుతోపాటు ఓ పోలీసు ఆఫీసర్‌ పాత్ర కూడా వున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మృతులను మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సంతోష్‌(40), అతని తల్లి పద్మ(65)గా గుర్తించారు. తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడే ముందు ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. సంతోష్‌ మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియో వుంది. ఈ వీడియోలో ఏమున్నదంటే…‘’బాసం శ్రీనుతో కలసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్‌ గౌడ్‌ ఇచ్చాడు. వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్‌ గౌడ్‌ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెడితే నన్ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్‌ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు మెదక్‌ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్‌బుక్‌ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్‌లో సమాచారాన్ని జితేందర్‌ గౌడ్‌కు ఇచ్చారు. జితేందర్‌ గౌడ్‌ మనుషులు ఫోన్‌లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్‌ మనుషులు ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాం. వాళ్ల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నాం’’ అని ఆ వీడియోలో సంతోష్‌ ఆవేదనతో అన్నారు. సంతోష్‌ను రామాయంపేటకు చెందిన ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారంటూ గతంలో 20 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వారు ఆత్మహత్య చేసుకోవడానికే కామారెడ్డి లాడ్జిలో దిగినట్లుగా తెలుస్తోంది. తల్లి పద్మ వైద్యం కోసం ఈ నెల 11న కామారెడ్డికి చేరుకున్న సంతోష్‌ ఓ లాడ్జిలో దిగారు. వైద్య పరీక్షల అనంతరం వారు కామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీకాళభైరవ స్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గదికి వచ్చేశారు.గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడం లాడ్జి సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ సోమనాథం, సీఐ నరేష్‌ పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంతోష్‌ను భూముల అమ్మే విషయంలో తమకు రూ.50లక్షలు ఇవ్వాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పోలీసు అధికారితో కలిసి డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు ప్రజాప్రతినిధులు సంతోష్‌పై కక్ష కట్టారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (Story: నమ్మిన స్నేహితుడే దగా : తల్లీకుమారుడు ఆత్మాహుతి)

See Also: 

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

వేసవి సెలవుల తేదీలు మారాయి!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1