UA-35385725-1 UA-35385725-1

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

చిత్రం: కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2, నటీనటులు: యశ్‌, శ్రీనిథి శెట్టి, సంజయ్‌దథ్‌, రవీనా టాండన్‌ ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, ఈశ్వరీరావు, అచ్యుత్‌కుమార్‌, మాళవిక అవినాశ్‌ తదితరులు, సంగీతం: రవి బస్రూర్‌, సినిమాటోగ్రఫీ: భువన్‌గౌడ్‌, ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి, నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌, రచన, క‌థ‌నం, దర్శకత్వం: ప్రశాంత్‌నీల్‌, విడుదల: 14-04-2022
KGF Chapter 2 Review: 2018 డిసెంబరు 21వ తేదీన కేజీఎఫ్‌ ఛాప్టర్‌1 విడుదలైంది. అప్పుడు దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. రివ్యూ రాసే వెబ్‌సైట్లు, పత్రికలు కూడా అదొక పరమచెత్త సినిమా అని రాశాయి. చాలా వెబ్‌సైట్లు 2.5/5 మించి రేటింగ్‌ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయితే రివ్యూలతో నిమిత్తం లేకుండా ఆ సినిమా అతిపెద్ద హిట్‌గా నిలిచింది. హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌లు ఉన్నట్టుండి టాప్‌ 5లోకి వెళ్లిపోయారు. రివ్యూలు రాసేవాళ్లంతా నోళ్లువెళ్లబెట్టారు. వాళ్లు రాసే చెత్త రివ్యూలు చూసి ప్రేక్షకులు సినిమాలకు వెళ్తారన్న భ్రమల్లో వుండే ఈ సమీక్షకులంతా అవాక్కయ్యారు. ఇప్పుడు కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 చిత్రానికి మాత్రం ఉదయాన్నే అందరూ రివ్యూలు రాసేశారు. సినిమా అదిరిందంటూ తీర్పులిచ్చేశారు. నిజానికి కేజీఎఫ్‌ 1 ఉన్నంత గొప్పగా కేజీఎఫ్‌ 2 వుందా? లేదా? అనేది మన సమీక్షలో చూద్దాం! ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో యశ్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌్‌ చాప్టర్‌ 1 సెన్సేషనల్‌ హిట్‌ కాగా దానికి కొనసాగింపుగా కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 మూవీ వచ్చింది.

కథేంటంటే?

కేజీఎఫ్‌ 2 కథలోకి వెళ్లాలంటే కేజీఎఫ్‌ 1 కథను ఒకసారి మననం చేసుకోవాలి. కోలార్‌ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. పవన్‌ (యష్‌) తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసం ముంబై వచ్చి నేర సామ్రాజ్యంలో రాకీగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ క్రమంలో కోలార్‌ గనుల్లో నియంతగా అధిపత్యం చలాయిస్తున్న గరుడను చంపితే ముంబై తనదే అని.. రాకీకి ఒక పెద్ద ఆఫర్‌ వస్తుంది. దీంతో అతన్ని చంపడానికి బెంగుళూరు వచ్చిన రాకీ… గరుడను చంపే అవకాశం వచ్చినా చంపకుండా, కోలార్‌ గనుల్లోకి ఎంటర్‌ అవుతాడు. కేజీఎఫ్‌ (నరాచీ) సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుంటే తల్లికిచ్చిన మాట నెరవేరుతుందని ఒక అంచనా వేసుకుంటాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాకీ తనకున్న శక్తియుక్తులతో గరుడను చంపేస్తాడు. నరాచీని తన సొంతం చేసుకుంటాడు.
ఇక కేజీఎఫ్‌2 కథ దానికి కొనసాగింపుగా వుంటుంది. అంటే…గరుడని చంపి కేజీఎఫ్‌ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న రాకీ (యశ్‌) తిరుగులేని శక్తిగా అవతరిస్తుండగా గరుడ తమ్ముడు అథీరా (సంజయ్‌ దత్‌) నరాచీ సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. అథీరా తన ఎత్తులతో రాకీ దారికి అడ్డు పడతాడు.. ప్రధానమంత్రి రమికాసేన్‌ (రవీనా టాండన్‌) కూడా రాకీ సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తుంది. ఇంతకీ వీళ్ల ప్రయత్నాలు ఏమయ్యాయి? రాకీ చివరకు ఏమయ్యాడు? అన్నది సినిమా కథ.

నటీనటుల పనితీరు

కేజీఎఫ్‌ పార్ట్‌ 1 తరహాలోనే యశ్‌ తన మేనరిజం, స్టయిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాకీ పాత్రలో యశ్‌ తన స్టామినా చూపించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా రాకీభాయ్‌గా యశ్‌ సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. హీరోయిజాన్ని చూపించడానికి యాక్షన్‌ ఘట్టాల్లో దుమ్ముదులిపాడు. భావోద్వేగాలు అవసరమైన చోట మెప్పించాడు. ఈసారి హీరోయిన్‌ రీనా (శ్రీనిధిశెట్టి) పాత్రకు తగిన ప్రాధాన్యత దక్కింది. ద్వితీయార్థంలో ఆమె పాత్రకు మార్కులు పడ్డాయి. సినిమాలో అథీరా పాత్ర మీద భారీ అంచనాలు పెట్టుకోగా అది కాస్త అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు. సంజయ్‌దత్‌ అథీరాగా కన్పించిన తీరు అదరగొట్టింది. కాకపోతే పాత్రకు తగినంత బలం లేకుండాపోయింది. ఇక రవీనా టాండన్‌ పాత్ర ఉన్నంతవరకు పవర్‌ఫుల్‌గా బాగా అనిపిస్తుంది. ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ పాత్రలు నామమాత్రమే. బహుశా తెలుగు నేటివిటీ కన్పించడం కోసం తెలుగు యాక్టర్లను పెట్టివుంటారని అర్థమైంది. చిన్నపాత్రలే అయినా ఈశ్వరీరావుతో సహా అందరూ బాగానే చేశారు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక నైపుణ్యం

సినిమాకు రవి బస్రూర్‌ ఇచ్చిన మ్యూజిక్‌ సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయడంలో రవి మ్యూజిక్‌ దోహదం చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు సూపర్బ్‌. మ్యూజిక్‌ తర్వాత భువనగౌడ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా వుంది. కెమెరా వర్క్‌ విషయంలో ఎక్కడా రాజీపడలేదని అర్థమవుతున్నది. హాలీవుడ్‌ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఫ్రేములు కన్పించాయి. ఇక డైరక్షన్‌ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ మరోసారి తన సత్తా చాటాడు. స్క్రీన్‌ప్లే కాస్త గందరగోళంగా వున్నట్లు అన్పించినా, కేజీఎఫ్‌ 1కి దీటుగా రెండో ఛాప్టర్‌ను తెరకెక్కించిన తీరు అద్భుతంగా వుంది. అతను పడ్డ శ్రమ ప్రతి సీనులోనూ కన్పిస్తుంది. ఇక నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. భాషకొక్క నటుడిని ఎంచుకున్నందున రెమ్యునరేషన్లతోపాటు రిచ్‌నెస్‌ అధికంగా వుండటంతో వ్యయం బాగానే పెట్టినట్లు అర్థమవుతోంది. నిర్మాతల రాజీపడని వైఖరి అగుపిస్తుంది.

విశ్లేషణ

నిజానికి కేజీఎఫ్‌ 1 ఉన్నంత గొప్పగా కేజీఎఫ్‌ 2 అస్సలు లేదు. పైగా సాగదీత. సినిమా మొత్తం సొల్లు కబుర్లే. కాకపోతే ప్రతి ఫ్రేమూ అదిరిపోయేలా ఎలివేషన్స్‌ ఉండటంతో సినిమా రిచ్‌గా వున్నట్లు కన్పిస్తుంది. కథ మొత్తం అతిగా వున్నట్లు అన్పిస్తుంది. కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 సూపర్‌ హిట్‌ కాగా ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా హీరో ఎలివేషన్‌, టైట్‌ స్క్రీన్‌ ప్లే, అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీతో కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 వచ్చింది. సినిమా చూసే ఆడియెన్స్‌ అందరినీ తన మాయలో పడేశాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. అంతవరకు ఓకే. పార్ట్‌ 1కు పెర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌గా చాప్టర్‌ 2 వచ్చినప్పటికీ, సినిమాలో కథ పెద్దగా లేదు. కాకపోతే దాన్ని నడిపించిన తీరు మెప్పించింది. ఇక మాస్‌ ఆడియెన్స్‌కి నచ్చే అంశాలు.. రోమాలు నిక్కబొడుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కేజీఎఫ్‌ మ్యాజిక్‌నే రెండో భాగంలోనూ కొనసాగేలా చేయడానికి ప్రయత్నాంచాడు డైరెక్టర్‌. మదర్‌ సెంటిమెంట్‌ని మేళవించి డైరెక్టర్‌ తన అద్భుతమైన ప్రతిభ కనబరిచాడని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్‌ కూడా ఊగిపోయేలా చేశాడు. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్‌ అవుతారు. రాకీభాయ్‌ హీరోయిజం, నరాచీ సామ్రాజ్యాన్ని ఆవిష్కరించిన తీరు, నిర్మాణ విలువలు, ఛాయాగ్రహణం, సంగీతం, యాక్షన్‌ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్‌పాయింట్స్‌. ద్వితీయార్థం వీక్‌గా వుండటం, విలనిజం పెద్దగా లేకపోవడం, కొన్ని సీన్లకు లాజిక్‌ లేకపోవడం మైనస్‌ పాయింట్స్‌. ఎలివేషన్లు, భారీతనం పక్కన పెడితే చాలా విషయాల్లో ‘కేజీఎఫ్‌-2’ ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే బలహీనమే. సెకండ్‌ పార్ట్‌ చూస్తుంటేనే ఓవర్‌ డోస్‌ ఫీలింగ్‌ కూడా కలిగింది. ఇందులో పెద్దగా కథే లేదు. బలవంతంగా సాగదీసినట్లు అనిపించింది. కేజీఎఫ్‌ 1లో ఉన్నట్లుగా కేజీఎఫ్‌ 2లో పెద్దగా మలుపులు లేవు. అథీరా ఇంతకాలం ఏమయ్యాడనే విషయాన్ని చూపించలేదు. కేజీఎఫ్‌ కోసం చచ్చినవాళ్లు బతికొస్తారన్న డైలాగ్‌తో అథీరాను భారీగా చూపిస్తారని ప్రేక్షకులు ఊహించడం సహజం. కానీ రాకీ ఓవర్‌ ఎలివేషన్‌ మాయలోపడి అథీరా పాత్రను డైరెక్టర్‌ ఎందుకో బలహీనపరిచాడు. రాకీ, అథీరాల క్లయిమాక్స్‌ ఫైట్‌ కూడా పేలవంగా వుంటుంది. రాకీ ఏకంగా ప్రధానమంత్రి వద్దకు వెళ్లి వార్నింగ్‌ ఇవ్వడం, పార్లమెంటులోకి చొరబడి ఎంపీని కాల్చేయడం వంటి సన్నివేశాలు మరీ అతిగా కన్పిస్తాయి. అంతా సినిమాటిక్‌గానే కన్పిస్తుంది. ఏదేమైనప్పటికీ, ధియేటర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అన్పిస్తుంది. అందులో ఏ ఒక్క పాత్ర కూడా సహజంగా వుండదు.
ఈ సినిమాలో హైలైట్‌ ఏంటంటే, కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3 కూడా వుంటుందని ఇండికేషన్‌ ఇవ్వడమే. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌-2’ రోలింగ్‌ టైటిల్స్‌ పూర్తయ్యాక అంతా అయ్యాక రవీనా టాండన్‌ ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-3’ అనే కొత్త పుస్తకం ముఖచిత్రాన్ని చూస్తున్న దృశ్యం పెట్టడంతో ఈ సిరీస్‌లో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయని అర్థమైంది. కాకపోతే, కేజీఎఫ్‌ 2 పెద్ద హిట్‌ అయితే తప్ప ఛాప్టర్‌ 3 జోలికి వెళ్లబోరని మనకీ తెలుసు. సినిమా ఫలితం కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3పై వుంటుందనేది చెప్పగలం. (Story: కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!)

See Also: 

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1