Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సిపిఐ నారాయణకు సతీవియోగం

సిపిఐ నారాయణకు సతీవియోగం

సిపిఐ నారాయణకు సతీవియోగం

హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) గురువారం సాయంత్రం మృతి చెందారు. తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఆప్కాబ్‌ బ్యాంకులో ఉద్యోగం చేసి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆమె టీవీ 99 డైరెక్టర్‌గా కొన్నాళ్లపాటు వ్యవహరించారు. నారాయణకు చేదోడువాదోడుగా వుండేవారు. సీపీఐ నారాయణ ఉద్యమ కెరీర్‌ వెనుక ఆమె పాత్ర గొప్పది. నారాయణ, వసుమతిదేవిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. ప్రస్తుతం వీరు అమెరికాలో వుంటున్నారు. నారాయణ, వసుమతిదేవిలు గతంలో హైదరాబాద్‌లోనే ఎక్కువకాలం నివాసముండేవారు. ఇప్పుడు కొంతకాలంగా చిత్తూరు జిల్లా ఐనంబాకంలోనే నివాసముంటున్నారు. గత కొంతకాలంలో వసుమతిదేవి అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇదివరకే గుండెపోటు వచ్చింది. అయితే చికిత్స అనంతరం పరవాలేదని అనుకున్న తరుణంలో మళ్లీ గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. గురువారంనాడు ఆమె భౌతికకాయాన్ని ఐనంబాకంకు తరలించారు. (Story: సిపిఐ నారాయణకు సతీవియోగం)

See Also: 

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!