Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

0
APSRTC
APSRTC

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

APSRTC Charges Hike: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి వీరబాదుడు బాదింది. ఈసారి ఆర్టీసీ బస్‌ ఛార్జీల రూపంలో జనంపై భారాన్ని మోపింది. అనూహ్యమైన రీతిలో రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ సంస్థ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఏపీలో ప్రయాణికుల చార్జీలను ఆర్టీసీ సంస్థ భారీగా పెంచేసింది. డీజిల్‌ సెస్‌ పేరుతో ఏపీఎస్‌ఆర్టీసీ ఈ వడ్డన చేయడం గమనార్హం. ఈ సెస్‌ పెంపుదల వల్ల ఆర్టీసీకి 720 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. డీజిల్‌ పేరుతో పల్లె వెలుగు బస్సుకు 2 రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో, డీలక్స్‌ సర్వీసు బస్సులకు 5 రూపాయలు, సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సులకు పది రూపాయల చొప్పున ఛార్జీలను పెంచుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటన చేశారు. పల్లె వెలుగు బస్సులో కనీస టికెట్‌ ధర 10 రూపాయలు అని పేర్కొన్నారు. పెరిగిన టికెట్ల ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ద్వారకా తిరుమలరావు వెల్లడిరచారు. డీజిల్‌ సెస్‌ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కాలంటే టిక్కెట్లపై 32 శాతం మేర ఛార్జీలు పెంచాల్సి వస్తుందని వెల్లడిరచారు. కోవిడ్‌ వల్ల గత రెండేళ్ల కాలంలో రూ. 5680 కోట్లు నష్టం వచ్చిందని ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జునరెడ్డి వివరించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచిన ధరల వల్ల సామాన్యుని నడ్డి విరుగుతుండగా, రాష్ట్రం తాజాగా చేసిన ఈ పెంపుదల మరింత ఇబ్బందికర పరిస్థితులకు దారితీయనున్నాయి. (Story: ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!)

See Also: 

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version