Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన

సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన

0

అర్నాబ్ తుపాను నేపథ్యంలో చింతూరు డివిజన్‌లో సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన

లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలు, రహదారులు, విద్యుత్ సరఫరా పరిస్థితుల పరిశీలన –
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు

న్యూస్‌తెలుగు/చింతూరుః అర్నబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో చింతూరు డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, రహదారుల పరిస్థితులు, విద్యుత్ సరఫరా, ప్రజల రాకపోకలపై పర్యవేక్షణలో భాగంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా మోతుగూడెం ప్రాంతంతో పాటు నేలకోట, కొత్తపల్లి, దేవరపల్లి తదితర ప్రాంతాలను సందర్శించి, తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో రహదారుల పరిస్థితులు, విద్యుత్ కనెక్టివిటీ, రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని తులసిపాక,సోకిలేరు వ్యూ పాయింట్‌లను కూడా సందర్శించారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి చిట్టపులి నరేంద్ర పడాల్‌తో పాటు ఓఎస్డీ (అడ్మినిస్ట్రేషన్) జావలి, డీఎస్పీ ఉదయ్ పావని, సిఐ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

అధికారులకు కీలక ఆదేశాలు

తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా:

* వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారే రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
* రహదారులపై నీరు నిలిచిపోవడం, చెట్లు లేదా ఇతర అడ్డంకుల వల్ల రాకపోకలకు అంతరాయం కలిగే పరిస్థితులను వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సందర్భాల్లో సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి.
* పర్యాటక ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకర ప్రదేశాలకు ప్రజలు, పర్యాటకులు వెళ్లకుండా అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి.
* అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో వెంటనే స్పందించి, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలి.
* ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందించాలి.

ప్రజల భద్రతకు ప్రాధాన్యత

అర్నాబ్ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాల సమయంలో వాగులు, వంకలు, నీరు ప్రవహించే రహదారులు మరియు ఇతర ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. (Story: సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన)

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version