ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?
అమరావతి: ఉగాది యుగానికే ఆది అని చెప్తారు. తెలుగువారి తొలి పండుగ ఇదే. హిందువుల పండుగలన్నీ ఈ ఉగాదితోనే మొదలవుతాయి. పట్ణణాలు, నగరాల్లో ఆంగ్ల సంవత్సరాది జనవరి 1కి ఇచ్చినంత ప్రాధాన్యత తెలుగు సంవత్సరాది ఉగాదికి ఇవ్వరు. కానీ పల్లెల్లో ఉగాదికే పట్టం కడతారు. రైతన్న ఏరువాక ఉగాదితోనే మొదలవుతుందని నమ్ముతాడు. అందుకే ఉగాది రోజున ప్రజలు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇంటిని మామిడి ఆకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు. తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పని సరిగా చేసుకుంటారు. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి అనేది తీపి, పులుపుతోపాటు ఆరు రుచులు వుంటాయి. అందుకే దీన్ని షడ్రుచుల సమ్మేళనమని పిలుస్తారు. పచ్చి మామిడి, కొత్త చింతపండు, బెల్లం, వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు.
రుచులు`దాని అర్థాలు
బెల్లం, అరటిపండు: (తీపి) ఆనందంగా వుండటమే ఆకాంక్ష.
వేప పువ్వు: (చేదు) దుఃఖం, బాధల గుర్తు
పచ్చి మిరపకాయలు (కారం): వేడి, కోపానికి చిహ్నం.
ఉప్పు (ఉప్పు): ఉత్సాహం, జీవిత సారమెరగడం.
చింతపండు (పులుపు): నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు.
మామిడి (వగరు): కొత్త సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధపడటం.
పచ్చడిని తయారు చేయడమెలా?
ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు బెల్లం పొడి చెరకు పచ్చి కొబ్బరి ముక్కలు చింతపండు ఎర్ర మిరప పొడి మామిడి కాయ గుజ్జు అరటిపండు ఉప్పు తయారీ విధానం: ముందుగా వేపపూతను శుభ్రం చేసుకుని నీటితో కడగాలి. బెల్లాన్ని తురుముకోవాలి. కొబ్బరి,మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడకట్టుకోవాలి. అనంతరం చింతపండు రసంలో బెల్లం వేసి.. కరిగే వరకూ కలపాలి. అనంతరం ఉప్పు, కొబ్బరి ముక్కలు, మామిడికాయలో ముక్కలు, చెరకు ముక్కలు,వేసి కలపాలి. తర్వాత వేపపువ్వు, అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు.. ఉగాది స్పెషల్ షడ్రుచుల సమ్మేళనం వేపపువ్వు పచ్చడి రెడీ..
ఉగాది పచ్చడి ఆరోగ్యమా? కాదా?
ఉగాది పచ్చడికి ఆయుర్వేద శాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’ ‘అశోకకళికా ప్రాశనం’అని పేర్లతో పిలుస్తారు. ఋతు మార్పుల కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైందని పూర్వీకులు చెపుతుంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, మిరప కాయలు, మామిడి కాయలు ఉపయోగించేవాళ్లు. విశేషమేమిటంటే, ఈ పచ్చడిని ఉగాది రోజు నుంచి శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం, ఆహారంలో ఉండే ఓ ఔషధ గుణాన్ని,వృక్షసంరక్షణ అవసరాన్ని,ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాదు హిందూ పండుగలకు, ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని విశదీకరిస్తుంది. బెల్లంలోని తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకు, విజయానికి సంకేతం. వేపలోని చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే. త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు అనే ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సో…నమ్మేవాడికి నమ్మినంత! ఏమాటకామాట…భారతదేశ పండుగలు, సంస్కృతిలోనే ఆయుర్వేదం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్షు వుంది. అందుకే ఇండియా ఈజ్ గ్రేట్! (Story: ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?)
See Also: ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)