Home వార్తలు కాలం రాసిన కథలు

కాలం రాసిన కథలు

0
Kaalam Rasina Kathalu Movie
Kaalam Rasina Kathalu Movie

*హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘కాలం రాసిన కథలు’ ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల*

ఎస్‌ఎమ్ ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నూతన తారలతో వైవిధ్యమైన జానర్‌లో.. ఎమ్‌ఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్‌ను తాజాగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కాలం రాసిన కథలు టైటిల్ చాలా బాగుంది. అలాగే సాగర్ రాసిన డబ్బు విలువ తెలియజేసే సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి సాగర్‌కి మరియు చిత్రంలో నటించిన నటీనటులు అలాగే పనిచేసిన టెక్నీషియన్లకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.

‘‘నంధ్యాల నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం తిరుగున్న టైమ్‌లో నాకు ‘కాలం రాసిన కథలు’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన సాగర్‌గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ‘నమ్మకానికి, మోసానికి మధ్య నలిగిపోతున్న మనిషి కథలు’ అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్‌ఫుట్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు..’’ అని చిత్ర హీరో అభిలాష్ గోగుబోయిన తెలిపారు. మరో హీరో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ.. నా సినీ కెరియర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఈ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చిన సాగర్‌గారికి థాంక్యూ..’’ అని చెప్పారు.

‘‘ఈ సినిమాలో అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. అందుకు నిదర్శనమే శ్రీకాంత్‌గారు విడుదల చేసిన ఈ ఫస్ట్ పాట. దీనికి ఎమ్‌ఎన్‌వి సాగర్‌గారు రాసిన లిరిక్స్ అందించగా.. సాయి చరణ్ ఆలపించారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాగర్ గారికి ధన్యవాదాలు..’’ అని మ్యూజిక్ డైరెక్టర్ అరమాన్ మెరుగు అన్నారు.

దర్శకనిర్మాత ఎమ్‌ఎన్‌వి సాగర్‌ మాట్లాడుతూ..  ‘‘కళ కోసం కల గని ఇష్టంతో కష్టపడుతున్న మా చిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ శ్రీకాంత్‌గారి చేతుల మీదుగా విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉన్నతమైన విలువలతో ఊహించని ట్విస్ట్‌లతో నేను రూపొందిస్తున్న ఈ సినిమాకి నాతో పాటుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నాము. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము..’’ అని తెలిపారు.
నూతన నటీనటులు ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: దేవి వరప్రసాద్ గెద్దడ,
మ్యూజిక్: అరమాన్ మెరుగు, సుభాష్ ఆనంద్;
ఎడిటర్: మేకల మహేష్,
పబ్లిసిటీ డిజైనర్: ఎమ్‌కె‌‌ఎస్ మనోజ్,
పిఆర్వో: బి వీరబాబు,
ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్: ఎమ్‌ఎన్‌వి సాగర్‌. (Story: కాలం రాసిన కథలు)

See Also: 

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version