Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కీలక జిల్లాలకు మొండిచెయ్యి!

కీలక జిల్లాలకు మొండిచెయ్యి!

కీలక జిల్లాలకు మొండిచెయ్యి!

అమరావతి: ఏపీ కొత్త మంత్రివర్గం కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమతుల్యతను పాటించడానికి చాలా వరకు ప్రయత్నించినట్లుగానే కన్పిస్తున్నది. అటు జిల్లాల వారీగా, ఇటు సామాజిక వర్గాల వారీగా బ్యాలెన్స్‌ చేయడానికి కృషి చేశారు. 25 మంత్రుల ఎంపికలో 11 మంది పాత మంత్రులే వున్నారు. మిగిలిన 14 మంది మంత్రుల ఎంపిక ఒక విధంగా కత్తిమీద సామే. అయినప్పటికీ, సాహసించి ఆయన చేసిన ప్రయత్నం గొప్పదే. ఇంత చేసినా 8 జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్‌టీఆర్‌, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం ఆ జిల్లా నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. దాదాపు అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో చోటు వుంటుందని అంతా భావించారు. కనీసం విశాఖపట్నం, ఎన్‌టీఆర్‌, తిరుపతి జిల్లాలను విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. కొన్ని జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. అందులో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం వంటి జిల్లాలు వున్నాయి. మూడు ముక్క‌లైన గుంటూరు జిల్లాలో గుంటూరును వ‌దిలేసి ప‌ల్నాడు నుంచి ఇద్ద‌రిని, బాప‌ట్ల నుంచి ఒక‌రిని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా నుంచి తొలుత తిప్పేస్వామిని జగన్‌ తన జట్టులోకి తీసుకున్నప్పటికీ, అనూహ్యంగా చివరి నిమిషంలో ఆయనను తప్పించి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను క్యాబినెట్‌ బస్సులోకి ఎక్కించుకున్నారు. అయితే ఆదిమూలపు సురేష్‌, తిప్పేస్వామిలు ఇరువురూ బావబావమరిదులు. అందువల్ల బహుశా వారిద్దరి మధ్య కుదిరిన అవగాహన మేరకే ఈ మార్పు జరిగి వుంటుందని భావిస్తున్నారు. విజయవాడ ప్రాంతమైన ఎన్‌టీఆర్‌ జిల్లాకు ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ప్రాతినిధ్యం వహించడం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కీలకమైన విశాఖపట్నం, తిరుపతి జిల్లాలకూ మొండిచెయ్యే ఎదురైంది. బహుశా క్యాబినెట్‌లో దక్కని 8 జిల్లాలకు ఇతర నామినేటెడ్‌ పోస్టుల్లో గట్టిగా ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వుందని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే మల్లాది విష్ణు (విజయవాడ)కు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ఛైర్మన్‌ పదవిని అప్పగించారు. భవిష్యత్‌లో బస్సు మిస్సయిన ఏడు జిల్లాలకు జగన్‌ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో వేచిచూడాల్సిందే! (Story: కీలక జిల్లాలకు మొండిచెయ్యి!)

See Also :

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు వీరే! (Full Details)

మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!