మైబిల్‌బుక్ పై స్మార్ట్ కలెక్ట్‌ను విడుదల చేయడం ద్వారా ఎస్‌ఎంబీల కోసం బ్యాంకింగ్ సేవల్లోకి ప్రవేశించిన ఫ్లోబిజ్
- సుప్రసిద్ధ జీఎస్‌టీ ఇన్వాయిసింగ్ మరియు ఎక్కౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఎస్‌ఎంబీ నియోబ్యాంక్ ఫ్లోబిజ్ కు చెందిన ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి మై బిల్ బుక్ ; ఇది చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు జీఎస్‌టీ అనుకూల ఇన్వాయిస్‌లు రూపొందించడంలో, ఇన్వెంటరీని నిర్వహించడంలో స్వీకరించతగినవి మరియు చెల్లింపులను నిర్వహించడంలో మరియు అధునాతన నివేదికల ద్వారా వ్యాపార పనితీరును ట్రాక్ చేయడంలో సహాయపడతాయి.
- స్మార్ట్ కలెక్ట్ ఆవిష్కరణతో, మై బిల్ బుక్ ఇప్పుడు యుపీఐ మరియు బ్యాంక్ లావాదేవీలకు మద్దతునందించడంతో పాటుగా వినియోగదారుల నుంచి చెల్లింపులను సేకరించడం, పెండింగ్ ఇన్వాయిస్‌లను స్వయంచాలకంగా పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది.
బెంగళూరు, 29 మార్చి 2022 : నియో బ్యాంక్ ఫ్లోబిజ్ నేడు ఎస్‌ఎంబీల కోసం బ్యాంకింగ్ సేవలలో ప్రవేశించేందుకు స్మార్ట్‌కలెక్ట్ ను ఆవిష్కరించింది. తమ ప్రతిష్టాత్మక జీఎస్‌టీ ఇన్వాయిసింగ్ మరియు ఎక్కౌంటింగ్ ఉత్పత్తి మై బిల్ బుక్ లో స్మార్ట్ బ్యాంకింగ్‌లో భాగంగా ఈ స్మార్ట్ కలెక్ట్‌ను ఆవిష్కరించింది. స్మార్ట్‌కలెక్ట్‌తో, వ్యాపార సంస్ధలు ఇప్పుడు తమ వినియోగదారుల నుంచి చెల్లింపులను ఇన్‌స్టెంట్‌గా యుపీఐ మరియు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా కలెక్ట్ చేయవచ్చు మరియు పెండింగ్ ఇన్వాయిస్‌లకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా వాటిని పునరుద్ధరించడమూ చేయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎస్‌ఎంబీలకు సేవలనందించే నియోబ్యాంక్ కోసం ఆర్థిక సువల రోడ్‌మ్యాప్‌కు నాంది పలికింది.
ఈ స్మార్ట్ కలెక్ట్ ఫీచర్ ఇప్పటికే మొబైల్ మరియు డెస్క్‌టాప్ అప్లికేషన్‌లలోని ప్రస్తుత మై బిల్ బుక్ వినియోగదారులకు ప్రత్యేక సెట్‌ను తీసుకువచ్చింది. రాబోయే కొద్ది వారాలలో నిర్ధిష్టమైన అర్హత ప్రమాణాలు కలిగిన వినియోగదారులకు ఈ సేవలను విస్తరించాలని ఫ్లోబిజ్ ప్రణాళిక చేసింది. స్మార్ట్ కలెక్ట్ అత్యంత సహజమైన డిజైన్. దీనిని అతి సులభంగా ప్రారంభించడంతో పాటుగా వినియోగించడమూ సులభం. ప్రస్తుతం అందుబాటులోని సామర్థ్యాలకు తోడుగా, మైబిల్‌బుక్ తమ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఇన్వాయిసింగ్ ఇంటర్‌ఫేస్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో ఆవిష్కరించింది. దీనిని సంస్థాగత వాణిజ్య మరియు ఫ్రాంచైజీ వ్యాపారాల కోసం ప్రారంభించడం ద్వారా స్మార్ట్ కలెక్ట్‌ను అత్యంత శక్తివంతమైన చెల్లింపుల పరిష్కారంగా వాణిజ్యేతర మరియు ఎస్‌ఎంబీలకు మైబిల్‌బుక్‌పై మారుస్తుంది.
రాహుల్ రాజ్, కో–ఫౌండర్ అండ్ సీఈవో–ఫ్లో బిజ్ మాట్లాడుతూ ‘‘జనవరి 2022లో నెలవారీ వాణిజ్యం ఒకమిలియన్‌కు పైగా క్రియాశీల ఎస్‌ఎంబీల ద్వారా మై బిల్ బుక్‌పై 1.58డాలర్లు గా నమోదు కావడంతో పాటుగా ఇది స్ధిరంగా వృద్ధి చెందుతుంది. స్మార్ట్ కలెక్ట్ ఆవిష్కరణ పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాయి. నియోబ్యాంకింగ్ రోడ్‌మ్యాప్ దిశగా ఇది మా తొలి అడుగుగా నిలుస్తుంది. ఈ విస్తృతస్థాయి స్మార్ట్ బ్యాంకింగ్ మాడ్యుల్ ఇప్పుడు ఎస్‌ఎంబీలు వినియోగదారుల నుంచి చెల్లింపులను స్వీకరించడంతో పాటుగా సరఫరాదారులు, వెండార్లు మరియు రోజువారీ వ్యాపార ఖర్చుల దిశగా ఔట్‌వార్డ్ లావాదేవీలను సైతం నిర్వహించేలా చేస్తుంది. ఇది కరెంట్ ఖాతా మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను నేరుగా మై బిల్‌బుక్‌పై తీసుకువస్తుంది. తద్వారా అన్ని రకాల ఇన్వాయిసింగ్, ఎక్కౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, బిజినెస్ రిపోర్టింగ్ మరియు వ్యాపార సంస్థల కోసం బ్యాంకింగ్ అవసరాలను సైతం ఏకీకృత పరిష్కారంగా నిలుస్తుంది’’ అని అన్నారు.
ఎస్‌ఎంబీలకు మొట్టమొదటి, వినూత్న తరహా చెల్లింపుల పరిష్కారం స్మార్ట్ కలెక్ట్. ఇది విస్తృత స్థాయిలో అత్యున్నత సేకరణ సామర్ధ్యాలను నేడు మార్కెట్‌లో లభిస్తున్న వాటికి ప్రత్యామ్నాయంగా అందించగలదుః
- యుపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్,ఆర్‌టీజీఎస్ లాంటి పలు చెల్లింపుల విధానాలకు మద్దతునందిస్తుంది
- నగదు ప్రవాహం మెరుగుపరచడానికి డెస్టినేషన్ ఖాతాలలో ఇన్‌స్టెంట్ సెటిల్‌మెంట్స్
- వినియోగదారుల వారీగా ఇన్వాయిస్‌లకు అనుగుణంగా లావాదేవీలు ఆటోమేట్‌గా సమన్వయం చేయబడతాయి.
- సేకరణ లావాదేవీలపై ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ఉచితంగా వినియోగించుకోవచ్చు.
- చెల్లింపుల లింక్‌లు, క్యుఆర్ కోడ్స్‌ను వినియోగదారులకు నేరుగా వాట్సాప్‌పై పంచుకోవచ్చు
- ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్స్ మరియు ప్రయోజనాలను మై బిల్ బుక్ వినియోగదారులు మరియు వారి వినియోగదారులు పొందవచ్చు.
ఫ్లో బిజ్ వీపీ– ప్రొడక్ట్స్ సిద్ధార్థ్ సేథ్ మాట్లాడుతూ ‘‘మేమెప్పుడూ కూడా వినియోగదారులే తొలుత విధానం అనుసరిస్తుంటాము. ఆ విధానంతోనే విస్తృత శ్రేణిలో విస్తరించతగిన సాంకేతిక పరిష్కారాలను సైతం రూపొందిస్తుంటాము. ఈ విధానంతో తీర్చిదిద్దిన మరో ఉత్పత్తి స్మార్ట్ కలెక్ట్. దీనిలో మేము భారతదేశంలో ఎస్‌ఎంబీ లను క్షుణ్ణంగా రికార్డ్–కీపింగ్ మరియు బ్యాకింగ్ ప్రవర్తనలను అధ్యయనం చేయడంతో పాటుగా అత్యంత సహజసిద్ధమైన, వినియోగించడానికి అతి సులభమైన చెల్లింపుల పరిష్కారంగా ఉంటుంది. సమగ్రమైన కెవైసీ ప్రక్రియను మేము కలిగి ఉన్నాము. స్మార్ట్ కలెక్ట్‌ను వినియోగించడం వినియోగదారులు ప్రారంభించక మునుపే దీనికి జీఎస్‌టీఎన్ లేదా పాన్ ధృవీకరణ కావాల్సి ఉంటుంది. మేము అత్యున్నతమైన భరోసాతో ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికెట్లను వినియోగించడం ద్వారా అనధికార వ్యక్తులెవరూ కూడా వినియోగదారుల సున్నితమైన సమాచారం పొందలేరు. మేము అత్యంత శక్తివంతమైన యాంటీ ఫ్రాడ్ మౌలిక వసతులు మరియు అల్గారిథమ్స్‌ను నిర్మించాము. దీనివల్ల ప్రతి లావాదేవీని డజన్ల కొద్దీ వేరియబల్స్‌లో స్కాన్ చేయడానికి అనుమానాస్పద కార్యకలాపాలు కనుగొనడానికి, నిరోధించడం వీలవుతుంది. ఉత్పత్తి మార్కెటింగ్ ద్వారా స్మార్ట్ కలెక్షన్‌ప్రయోజనాల గురించి వినియోగదాలకు అవగాహన కల్పిస్తున్నాము. మరియు ప్రత్యక్ష కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అనుభవాన్ని పునరుద్ధరిస్తున్నాము’’ అని అన్నారు.
మైబిల్ బుక్‌పై నియంత్రిత స్మార్ట్ కలెక్ట్ ఫీచర్ నియంత్రితంగా ప్రారంభమైనస్పటి నుంచి 30%కు పైగా వావ్ వృద్ధి చెందుతుంది మరియు వార్షిక రన్‌రేట్ 50 మిలియన్ డాలర్లను చేరుకుంది. (SStory: బ్యాంకింగ్ సేవల్లోకి ఫ్లోబిజ్)
See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)
తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్ల తుఫాన్!