Home Blog Page 5

రాగి వేణు మృతి అత్యంత బాధాకరం

0

రాగి వేణు మృతి అత్యంత బాధాకరం

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 1వ వార్డుకు చెందిన రాగివేణు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగివేణు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విలువైన కుటుంబానికి తానెల్లప్పుడు అండదండగా ఉంటానని, మృతి చెందిన వ్యక్తిని తీసుకురాలేమని, మనోధైర్యం పాటించాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు.కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ జయశ్రీ చుక్కరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, pcc సభ్యులు శంకర్ ప్రసాద్, నాయకులు ఎస్ ఎల్ ఎన్ రమేష్, లక్కాకుల సతీష్, స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : రాగి వేణు మృతి అత్యంత బాధాకరం )

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలి

0

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆత్మకూరు మండలంలోని బాల కిష్టాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ పనులు సకాలంలో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నిర్మాణ బిల్లులు సమయానికి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని అన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆత్మకూరు పట్టణంలోని ఉచిత డయాలిసిస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ముందుగా దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సి వచ్చేదని, ప్రస్తుతం స్థానికంగా డయాలిసిస్ సౌకర్యం అందుబాటులో ఉండటం చాలా సౌకర్యంగా మారిందని రోగులు కలెక్టర్ కు తెలియజేశారు. రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా మరుగుదొడ్డి (టాయిలెట్) సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ పీడీ విఠోబా, తహసిల్దార్ జె కే మోహన్, ఎంపీడీవో, ఆర్ఎంఓ డాక్టర్ చైతన్య గౌడ్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు పడేవిధంగా అధికారులు కృషి చేయాలి )

లేబర్ కోడ్ లకు, వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే ను పాటించండి

0

లేబర్ కోడ్ లకు, వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే ను పాటించండి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, వనపర్తి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ తదితరులు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను తీసివేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల కార్మికులకు హక్కులు లేకుండా చేసి కార్పొరేట్ కంపెనీలు కార్మికుల శ్రమను దోచుకునే విధంగా నాలుగు లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కార్మిక చట్టాల ప్రకారం కార్మికులు రోజుకు 8 గంటల పని చేసేవారు లేబర్ కోడుల ప్రకారం ఎక్కువ పని గంటలు చేయించుకొని కార్మికుల శ్రమను కార్పోరేట్ కంపెనీలు దోచుకుంటున్నాయి. రైతులు దేశవ్యాప్తంగా 20 కోట్ల కుటుంబాలు ఉన్నాయి బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచుతామని చెబుతూనే అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు దిగుమతి సుoకాన్నీ ఎత్తివేసింది ఈ రకంగా మన దేశంలో పండించిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్,పాల ధరలు పడి పోవడం వల్ల ఇక్కడి మనదేశ రైతాంగం తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులతోపాటు గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు పరుస్తామని చెప్పి నేటికి అమలు చేయకుండా రైతాంగానికి మోసం చేస్తూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నది. 4 లేబర్ ఎత్తివేయాలని వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు,వీబి జీ రాంజీ,విత్తన బిల్లులను రద్దు చేయాలని, గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమావేశంలో AISF వనపర్తి డివిజన్ కార్యదర్శి వంశి,కార్మిక నాయకులు మురళి పాల్గొన్నారు. ఏప్రిల్ 1 జరిగే బ్లాక్ డే నిరసనలో కార్మికులు, రైతులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు పాల్గొ ని జయప్రదం చేయాలని చెప్పారు.(Story : లేబర్ కోడ్ లకు, వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే ను పాటించండి )

వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ఘన విజయం..

0

వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ఘన విజయం..

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ 58 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బార్ అసోసియేషన్ పరిధిలో మొత్తం 126 మంది సభ్యులకు గాను 108 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్‌కు 78 ఓట్లు రాగా, ప్రత్యర్థి అశోక్ బాబుకు 20 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు నోటాకు పడగా, మరో 2 ఓట్లు చెల్లనివిగా (ఇన్వాలిడ్) తేలాయి.మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మీసాల శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి వరగాని శివశంకర్ బాబు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్‌గా ముండ్రు చంద్రమోహన్, సెక్రటరీగా మారెళ్ళ సీతారామాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా చీమకుర్తి బ్రహ్మం, ట్రెజరర్‌గా దూళ్ల నాగరాజు, లేడీ రిప్రజెంటేటివ్‌గా పొట్లూరి మాధవి, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా మాడావత్ శివ నాయక్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలుపొందిన నూతన కార్యవర్గానికి సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, జూనియర్ న్యాయవాదులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపునకు కృషి చేసిన సీనియర్, యూనియన్ న్యాయవాదులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(Story : వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ ఘన విజయం.. )

సెల్లార్‌లో గ్రంథాలయం పాఠకులకు అవస్థలు

0

సెల్లార్‌లో గ్రంథాలయం పాఠకులకు అవస్థలు

నూతన భవనం ఏర్పాటు చేయాలని అధికారులకు ఏఐవైఎఫ్ వినతి

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణంలోని కీర్తి థియేటర్ పక్కన సెల్లార్‌లో నడుస్తున్న శాఖ గ్రంథాలయంతో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నూతన భవనం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అద్దె భవనంలోని సెల్లార్‌లో నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయానికి కిందికి వెళ్లే మెట్లకు రక్షణ గోడ లేదు. దీంతో విద్యార్థులు, యువకులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు జారిపడి గాయాలపాలవుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు సెల్లార్‌లోకి ఊట నీరు చేరి పుస్తకాలు తడిసి పాడైపోతున్నాయి. ప్రజల నుంచి ఏటా లక్షలాది రూపాయల గ్రంథాలయ సెస్సు వసూలు చేస్తున్నా, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విచారకరమన్నారు. గత పదేళ్లుగా గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. సెస్సు రూపంలో వసూలు చేసిన డబ్బును గ్రంథాలయ అభివృద్ధికే ఉపయోగించాలని, పుస్తక ప్రియులకు అందుబాటులో ఉండేలా సౌకర్యవంతమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.కోటేశ్వరరావు, యు.అజయ్ కుమార్, షేక్ కరీం, రవితేజ, కిరణ్ కుమార్, మహేంద్ర సింగ్, హుస్సేన్ బాబు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : సెల్లార్‌లో గ్రంథాలయం పాఠకులకు అవస్థలు )

వినుకొండ ఎస్సీ హాస్టల్‌లో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షణ

0

వినుకొండ ఎస్సీ హాస్టల్‌లో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షణ

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, బహుమతుల ప్రదానం

న్యూస్ తెలుగు/వినుకొండ  : స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు మేళం మధుబాబు ఆదేశాల మేరకు, ఉపాధ్యక్షులు ముట్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏలూరి శశికుమార్, ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మకుటం శివ హాజరై హాస్టల్ విద్యార్థులతో కలిసి ‘మన్ కీ బాత్’ను వీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతినెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ఇచ్చే సందేశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక అంశాలు, దేశాభివృద్ధిపై ప్రధాని పంచుకునే ఆలోచనలను విద్యార్థులు ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సెక్రటరీ జాన్‌బాబు, ఈపూరు ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల బెన్ని, పలువురు హాస్టల్ విద్యార్థులు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : వినుకొండ ఎస్సీ హాస్టల్‌లో ప్రధాని ‘మన్ కీ బాత్’ వీక్షణ )

అతిసారా లేదు – ప్రజలు భయపడవద్దు

0

అతిసారా లేదు – ప్రజలు భయపడవద్దు

న్యూస్ తెలుగు/వినుకొండ  : నియోజకవర్గంలోని ఈపూరు మండలం పొనుగోటివారిపాలెంలో అతిసార వ్యాధి ప్రబలుతోందన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వి ఆంజనేయులు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న ఆయన, ఘటనపై సమాచారం అందిన వెంటనే అక్కడి నుంచే స్థానిక వైద్యాధికారులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వైద్య బృందాలను పంపి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఎటువంటి అతిసార కేసులు నమోదు కాలేదని, కేవలం వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సాధారణ విరోచనాలు మాత్రమేనని అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జీవి భరోసా ఇచ్చారు. తాను దూరంగా ఉన్నప్పటికీ గ్రామ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వైద్య సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ కాచి చల్లార్చిన నీటినే త్రాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.(Story : అతిసారా లేదు – ప్రజలు భయపడవద్దు )

బీసీల శకం ప్రారంభమైంది

0

బీసీల శకం ప్రారంభమైంది

ఐక్య ఉద్యమాలు నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు వెల్లడి

న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రస్తుత దశలో అస్తిత్వ ఉద్యమాలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్నాయని ఇది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం అని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి జిల్లా స్థాయి ముఖ్యుల సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జన గణనలో కులగణన ను చేపట్టి ఏ కులం జనాభా ఎంత ఉందో లెక్కలు తీసి అదేవిధంగా జనాభా దామాషా పద్ధతిలో రాజకీయ ఆర్థిక రిజర్వేషన్లు కేటాయించాలని దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని చట్టసభల్లో కూడా జనాభా దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించి అన్ని కులాల వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించే విధంగా చర్యలు చేపట్టాలని దేశంలో 3500 కులాలు ఉంటే ఈనాటికీ మూడువేల 400 కులాలు పార్లమెంటు గడప తొక్క లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని ఏకాభిప్రాయ సాధన పేరుతో గత 11 సంవత్సరాలుగా కుల గణన చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం మోకా లడ్డుతోందని, ఇప్పుడు గాని కుల ఘనంగా చేపట్టకపోతే బీసీలు మరో 10 సంవత్సరాలు పాటు వెనక్కి నెట్టివేయబడతారని అందుకొరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలు నిర్మించేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు ఆయన తెలిపారు వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి కే విజయ రాములు మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఇరవై ఒక్క హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూడరాదని, బీసీల అభివృద్ధి కొరకు సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నారని ఇప్పటికీ శాసనసభలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారని కేవలం 11 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మిగతా 50 వేల రూపాయలు బీసీల అభివృద్ధి కొరకు కేటాయించి అట్టి నిధులను ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశానికి జె రమేష్ అధ్యక్షత వహించగా కే లక్ష్మీనారాయణ, కృష్ణ, మైబూస్, కుమార్, గోపాలకృష్ణ, నరేష్, వంశీ, లక్ష్మణ్, శిరీష, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.(Story : బీసీల శకం ప్రారంభమైంది )

సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు?

0

సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు?

న్యూస్ తెలుగు/వినుకొండ  : ​మహిళల ఆస్తి హక్కులు కేవలం ఒక కుటుంబానికి పరిమితమైన వ్యవహారం కాదని, అది సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రత, సమానత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చట్టబద్ధంగా తన తల్లి, చెల్లెలకు సమాన హక్కులు ఇవ్వడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత కుటుంబంలోనే తల్లి, చెల్లెలకు న్యాయం చేయలేని వారు, రేపు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఎలా నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించని నాయకత్వం సమాజాన్ని సన్మార్గంలో నడిపించలేదని విమర్శించారు.మహిళల ఆస్తి హక్కులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేసిన ఆయన, ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు మహిళా లోకం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.సత్యం, న్యాయం కోసమే డాక్టర్ సునీత, డాక్టర్ వైఎస్ సునీత న్యాయం కోసం చేస్తున్న పోరాటం వ్యక్తిగతమైనది కాదని, అది సత్యం, న్యాయం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటమని జీవీ ఆంజనేయులు అభివర్ణించారు. ఈ పోరాటానికి మహిళలు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయం కోరే ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలు, సాక్ష్యాధారాల ధ్వంసం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కేసులో పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తు జరిపి నిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత కేసుల నుంచి బయటపడటానికి, అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి వినియోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.​కుల, మత, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా ఉండి ఖండించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మహిళల ప్రాణాలు, ఆస్తి హక్కులను కాపాడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టాలని జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు.(Story : సొంత కుటుంబానికే న్యాయం చేయలేని జగన్.. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? )

ముస్లిం సోదరులకు కొండంత అండగా ఉంటాం

0

ముస్లిం సోదరులకు కొండంత అండగా ఉంటాం

న్యూస్ తెలుగు/వినుకొండ  : ​ముస్లిం సోదరులకు ఎన్డీయే ప్రభుత్వం, తాను వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు స్పష్టం చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆయన ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలు, అభివృద్ధి సాధించాలని, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొనాలని ఆయన ప్రార్థించారు. రాష్ట్రంలో ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాల నిమిత్తం రూ. 45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిధులు రూ. 45 లక్షలతో నిర్మించిన ప్రహరీ గోడతో ఈద్గాకు ఎంతో అందం వచ్చిందని ఆయన అన్నారు. మత పెద్దల కోరిక మేరకు మిగిలిన పనుల పూర్తికి మరో రూ. 25 లక్షలు వెచ్చించి, ఈ ఏడాదిలోనే పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ఈద్గా నిర్మాణ ఖర్చులో సగం (50 శాతం) నిధులను తన వ్యక్తిగత బాధ్యతగా అల్లాకు సమర్పిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముస్లిం పెద్దలను కోరారు. తనను మూడుసార్లు గెలిపించడంలో ముస్లింల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి అండదండలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. కష్టసుఖాల్లో వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ముస్లింలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, ఆర్థిక ప్రగతిలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే స్థానిక ముస్లిం కమిటీ పెద్దలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా వెల్లడించారు.(Story : ముస్లిం సోదరులకు కొండంత అండగా ఉంటాం )

Photo Gallery

error: Content is protected !!