సమాజం కోసం ఏమైనా చేస్తా
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సమాజ హితం కోసం చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.
శుక్రవారం గురజాడ కళాభారతి ఆవరణలో ప్రబోధ సేవా సమితి , ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గురాన అయ్యలు పాల్గొన్నారు. శ్రీకృష్ణపరమాత్మ విగ్రహాన్ని దర్శించి, పూజలు చేశారు. నిర్వాహకులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, త్రైత సిద్ధాంత భగవద్గీత అందజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ శ్రీకృష్ణతత్త్వం.. మానవాళికి విజయమంత్రమన్నారు.
ద్వాపర యుగం నుంచి నేటి కలికాలం వరకు పూజలందుకుంటున్న శ్రీకృష్ణుడి బోధనలు అందరికి అనుసరణీయం అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. (Story : సమాజం కోసం ఏమైనా చేస్తా)