బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటా : ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి:
ఈనెల 28వ తేదీ బుధవారం సాయంత్రం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆదేరువు కోల్పోయిన ఆ కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మొదటగా మృతి చెందిన యువకుడు శ్రీపురంచందు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించే వారి తల్లిదండ్రులను ఓదార్చి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. తక్షణ సహాయంగా రూ.25000 అందించారు అనంతరం మరో యువకుడు కావలి అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కుటుంబాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని… ఎలాంటి అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబ సభ్యులకు రూ .25 వేల రూపాయలను తక్షణ సహాయం కింద ఆయన అందించారు
కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు