ద్వారపూడి సోలార్ ప్లాంటును 15 రోజుల్లో పునరుద్ధరణ జరగాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : ద్వారపూడి గ్రామం జేఎన్టీయూ వద్ద కొండ పై నున్న సోలార్ ప్లాంట్ ను 15 రోజుల్లో పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేసి సోలార్ ప్లాంట్ పరిస్థితి పై కలెక్టర్ ఆరా తీశారు. నెడ్ కాప్ ఆధ్వర్యంలో 4.8 కోట్ల రూపాయల ఖర్చుతో 2017 లో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, 10 సంవత్సరాల వరకు కాంట్రాక్టరే నిర్వహణ చూడవలసి ఉన్నదని అలాగే సంరక్షణ బాధ్యత కూడా వారిదేనని మున్సిపల్ కమీషనర్ మల్లయ్య నాయుడు కలెక్టర్ కు వివరించారు. ప్రస్తుతం ప్యానెల్స్ అన్నీ పాడైపోయాయని, వాటిని పునరుద్ధరించడానికి కనీసం 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని నెడ్ కాప్ అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ప్లాంట్ ను నిర్లక్ష్యంగా వదిలేయడం వలన నష్ట జరిగిందని, కాంట్రాక్టర్ కు, నెడ్ కాప్ అధికారులకు, వెంటనే నోటీస్లు జారీ చేయాలని, చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పాత ఫైల్ తీసి నోటీస్లు జారీ చేయడం, టెండర్, అగ్రిమెంట్ కాపీలను వెంటనే సబ్మిట్ చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఈ ఈ శ్రీనివాస రావు, నెడ్ కాప్ అధికారులు పాల్గొన్నారు. (Story : ద్వారపూడి సోలార్ ప్లాంటును 15 రోజుల్లో పునరుద్ధరణ జరగాలి)