నాగార్జున సాగర్ కు మరోసారి వరద ఉదృతి
న్యూస్‌తెలుగు/పల్నాడు జిల్లా/మాచర్ల : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృత పెరిగింది…దాంతో ప్రాజెక్టు 26 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి,2,40,906 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు.టోటల్ ఇన్ ఫ్లో 2,40,906 క్యూసెక్కులు వస్తుండగా,అదే ఇన్ ఫ్లో ను ఔట్ ఫ్లో గా దిగువకు వదిలేస్తున్నారు.పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా,ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులకు చేరింది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గానే కొనసాగుతోంది. సాగర్ జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పతి.