శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : శ్రీ చైతన్య పాఠశాల కామాక్షిగర్ బ్రాంచ్ లో తెలుగు భాషా దినోత్సవం , జాతీయ క్రీడల దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ చైతన్య పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు ఆర్. శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు భాషను వాడుక భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని కొనియాడారు. అలాగే భారతదేశానికి మూడుసార్లు జాతీయ క్రీడా హాకీలో ఒలింపిక్ పథకాలు సాధించిన ధ్యాన్ చంద్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఆటలలో కూడా ప్రావీణ్యం సాధించాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల అకాడమీ కోఆర్డినేటర్ ఎన్ వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయినిజ్యోతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మాతృభాషను మరవరాదని తెలుగు భాషాభివృద్దికి కృషిచేసిన మహనీయులు గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు ని మరవరాదని చెప్పారు. చదువుతోపాటు ఆటలలోను రాణించాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్స్ త్రినాధ నాయుడు, అప్పలనాయుడు, తెలుగు ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు. (Story : శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు)