111 డాక్టరేట్ల డాక్టర్!
అత్యంత ప్రతిభాశాలి డాక్టర్ సాగి సత్యనారాయణ.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నాలుగుసార్లు చోటు.
ఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి.
2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డు.
స్వల్ప వ్యవధిలో అనేక గ్రంధాలు రాసిన జ్ఞానయోగివివిధ అంశాలకు సంబంధించి డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభాపాఠవాలకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు లభించింది. భారత ప్రతిభారత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావిస్తూ 2020. డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రకటించింది.ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ డైరెక్టర్ గావ్లీ ఓ పత్రం పంపారు.
ప్రతిభ అనేకమందికి ఉండొచ్చు. అయితే అసాధారణ ప్రజ్ఞ అనేది దేవుడిచ్చిన ఓ తిరుగులేని వరం. అది అతికొద్దిమందికే సొంతం. ఆ కోవకే చెందుతారు మల్కాజ్‌గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనారాయణ. వైద్యుడిగా కొనసాగుతూనే మూడు దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిష్యం,యోగ తదితర అంశాలపై తెలుగు ఆంగ్ల భాషల్లో 180 పుస్తకాలు రచించారు. వీటిద్వారా ఇప్పటివరకు నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకున్నారు. తొలి గిన్నిస్ రికార్డును 2016 జనవరి 28న అందుకోగా రెండోది అదే ఏడాది ఆగస్టులో వచ్చింది. మూడో గిన్నిస్ రికార్డును 2019 అక్టోబర్ 3వ తేదీన దక్కించుకున్నారు. 2022 ఆగస్టు 22న నాలుగోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఒకటి లేదా రెండు డాక్టరేట్ పట్టాలను సాధించగలుగుతాడు. మరి 33 డాక్టరేట్లు పొందడం అంటే దేవుడి కృప, సాధన తప్ప మరొకటి కానేకాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలనుంచి అత్యధికంగా111 డాక్టరేట్లను పొందారు డాక్టర్ సాగి సత్యనారాయణ. ఇందులో ,డాక్టర్ ఆఫ్ సైన్స్ 15 .. డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు 25తోపాటు 71 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలను దక్కించుకున్నారు. ఇదంతా కేవలం 41 ఏళ్ల వ్యవధిలోనే సాధించారు. ఇప్పటివరకు అత్యధికంగా 180 గ్రంధాలను రచించారు. మొత్తం 111 డాక్టరేట్లను ఆయన సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లను సాధించిన గొప్ప వ్యక్తిగా నిలిచారు.
1980-2021 మధ్య కాలంలోనే ఇదంతా పూర్తయింది. ప్రస్తుతం రెండు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి గుజరాత్ కేంద్రంగా పనిచేసే మహర్షి వేదవ్యాస ఇంటర్నేషనల్ వేదిక్ విశ్వవిద్యాలయం. 2020 ఫిబ్రవరి 15వ తేదీన డాక్టర్ సాగిని ఈ విశ్వవిద్యాయం “ఉపకులపతిగా నియమించింది. గుజరాత్ లోని మైక్రోబయాలజీ విశ్వవిద్యాలయానికి కూడా ఆయన వైస్ చాన్సలర్ గా పనిచేస్తున్నారు.
రికార్డులు, పురస్కారాల పరంపర
2011లో డాక్టర్ సాగి సత్యనారాయణ రచించిన శ్రీమద్ హనుమద్ భాగవతం పుస్తకాన్నిఢిల్లీ తెలుగు సంఘం అత్యుత్తమ పుస్తకంగా గుర్తించింది. ఇందుకుగాను నగదు బహుమతిని అందజేసింది. గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 2013 నవంబర్ 15న జరిగిన కార్య క్రమంలో సాయి సంస్థలు… డాక్టర్ సాగి సత్యనారాయణకు స్వర్ణ కంకణం తొడిగి… సత్కరించాయి. అమెరికాలోని మేరీల్యాండ్ జ్యోతిష్యంలో అసాధారణ ప్రజ్ఞను గుర్తించిన నాగపూర్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం 2018 ఆగష్టు 16 స్వర్ణపతకం అందజేసింది. 2018 మార్చి 13వ తెలంగాణ ప్రభుత్వం… భారత ప్రతిభారత్న పురస్కారం అందజేసింది.
2019 అక్టోబర్ 21న ఫెంటాస్టిక్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో డాక్టర్ సాగి పేరు నమోదైంది. అదే ఏడాది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 12వ ఇన్ స్పైరింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో పేరు నమోదైంది. 2020, సెప్టెంబర్ 15వ తేదీన వరల్డ్ కాన్‌స్టిట్యూషన్ అండ్ పార్లమెంట్ అసోసియేషన్…డాక్టర్ సాగి సత్యనారాయణకు పురస్కారం అందజేసింది. 2021 మార్చి 3వ తేదీన ఇంగ్లాండ్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. అదే నెల 2020-21 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డు అవార్డు అందజేయడమే కాకుండా సత్కరించింది. ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లు పొందిన వ్యక్తిగా నిలిచిన నేపథ్యంలో ఈ సన్మానం జరిగింది. బ్రహ్మజ్ఞానం. రచించినందుకుగాను, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ ఏడాది మార్చి 21వ తానా సంస్థ ఆయనకు గండపెండేరం తొడిగి సత్కరించింది. తాజాగా డాక్టర్ సాగి సత్యనారాయణ రచించిన సనాతన ధర్మం అనే పుస్తకానికి అంతర్జాతీయంగా బహుళ ప్రాచుర్యం లభించింది.
తాజాగా
డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభాపాఠవాలకు గుర్తింపు లభిస్తూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న మా భువనేశ్వరి విశ్వవిద్యాలయం…ఈ డాక్టర్‌గారికి మరో డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. అలాగే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం ఇంకో డాక్టరేట్, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వేదిక్ హిందూ విశ్వవిద్యాలయం మరో డాక్టరేట్‌ను అందజేశాయి. (Story: 111 డాక్టరేట్ల డాక్టర్!)
See Also
అత్యధికంగా అనుసరిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పుష్ప 2
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106