హుకుంపేటలో వైభవంగా శ్రీ సీతారామకళ్యాణం
న్యూస్ తెలుగు/ విజయనగరం : హుకుంపేట బుక్కా వీధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం బుక్కా వీధి శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీత సమేత శ్రీరామచంద్రులకు ప్రధాన అర్చకులు పీసపాటి రాజగోపాలచార్యులు వేద మంత్రాల సాక్షిగా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యంలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సాoస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రామసంకీర్తనలు అందరిని అలరించాయి.sతదితరులు పాల్గొన్నారు.(Story : హుకుంపేటలో వైభవంగా శ్రీ సీతారామకళ్యాణం )